Political News

పవన్ ఉద్దేశం జనసైనికులకు అర్థమవుతోందా?

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖచిత్రం ఏంటో అర్థమైపోయింది. అనుకున్నట్లే తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ విషయమై నిన్న క్రిస్టల్ క్లియర్‌గా ప్రకటన చేసేశాడు. ఐతే పొత్తును ప్రకటించే విషయంలో పవన్ తొందరపడ్డాడని.. ఇంకా సీట్ల పంపిణీ విషయమై చర్చలే మొదలుకాకముందే హడావుడిగా ఇప్పుడీ ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని జనసేనలో ఒక వర్గం ప్రశ్నిస్తోంది. దీని వల్ల సీట్ల పంపిణీలో పవన్ బార్గైనింగ్ పవర్ కోల్పోయాడనే చర్చ కూడా నడుస్తోంది.

రేప్పొద్దున తమకు సీట్లు తక్కువ ఇవ్వజూపినా పవన్ సర్దుకుపోవాల్సిందే అని, పొత్తు ప్రకటన చేసింది తనే కాబట్టి వెనక్కి తగ్గలేక టీడీపీ ఎన్ని సీట్లిస్తే అన్నింటితో సర్దుకుపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వారంటున్నారు. పవన్ ప్రకటన పార్టీ నేతలు, కార్యకర్తల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసేలా ఉందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

ఐతే ఈ విషయాల్లో వాస్తవం లేకపోలేదు కానీ.. ఇక్కడ పవన్ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అందరికీ తెలియజెప్పాలనుకున్నాడు. తనకు మిగతా అన్ని విషయాల కంటే జగన్‌ను ముఖ్యమంత్రి సీటు నుంచి దించడమే ప్రధాన లక్ష్యమని.. అదే అందరి లక్ష్యం కావాలని పవన్ చెప్పకనే చెప్పేశాడు. ఇప్పుడు తమకు కొంత ఇబ్బంది తలెత్తినా.. కొంత అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ.. మళ్లీ వైసీపీ అధికారంలోకి రాకూడదన్నది పవన్ ఉద్దేశం. అదే జరిగితే జరిగే అరాచకాలను తట్టుకోలేమని.. ఒక్కసారి ఛాన్స్ దొరికితేనే ప్రతిపక్ష పార్టీలను దారుణంగా టార్గెట్ చేశారని.. అలాగే ఏపీలో అభివృద్ధి ఆగిపోయి రాష్ట్రం అథోగతి పాలైందని పవన్ భావిస్తున్నారు.

మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే జరిగే పరిణామాలు ఊహకందని విధంగా ఉంటాయని.. ఇటు జనసేన, అటు టీడీపీ పార్టీలను ఇంకా తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసి వాటి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తారని.. అందుకే పొత్తు వల్ల, ముందే ప్రకటన చేయడం వల్ల జనసేనకు కొంత అన్యాయం జరిగినా పర్వాలేదని.. కానీ జగన్‌ను దించాలంటే మాత్రం కొంత రాజీ పడక తప్పదని.. జనసైనికులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని పవన్ చెప్పకనే చెప్పినట్లయింది.

This post was last modified on September 15, 2023 11:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

3 minutes ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

1 hour ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

3 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

3 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

3 hours ago

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

5 hours ago