టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై జాతీయ నేతలు స్పందిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. కొన్ని పార్టీలు కూడా బాబుకు మద్దతు ప్రకటించాయి. కానీ పక్క రాష్ట్రంలోనే ఉన్న సీఎం కేసీఆర్ మాత్రం బాబు అరెస్టుపై ఇంతవరకూ స్పందించలేదు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం బాబు అరెస్టును ఖండించడం విశేషం. ఆ ఎమ్మెల్యేలు కూడా టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి చేరినవాళ్లే కావడం ఇక్కడ గమనార్హం.
సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తాజాగా బాబు అరెస్టుపై రియాక్టయ్యారు. బాబు అరెస్టు అక్రమమని ఆరోపించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని వెంకట వీరయ్య మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ అండ చూసుకునే వైసీపీ రెచ్చిపోతుందని చెప్పారు. చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టడం సరికాదన్నారు. మరోవైపు బీజేపీ కనుసన్నల్లోనే బాబు అరెస్టు జరిగిందని గాంధీ ఆరోపించారు. అరెస్టులు చేసి బాబు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలేరన్నారు.
బాబు అరెస్టుపై ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించడం బాగానే ఉంది. కానీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయని విషయంపై ఎమ్మెల్యేలే రియాక్టవ్వడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఆదేశాలతోనే టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు బాబుకు మద్దతుగా మాట్లాడారా? అనే ప్రశ్న వినిపిస్తోంది. లేదంటే బాబుపై అభిమానంతోనే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారా? అన్నది కూడా అంతుపట్టడం లేదు. ఒకవేళ సొంతంగానే వ్యాఖ్యలు చేసి ఉంటే దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ద్రోహిగా చంద్రబాబును చూసే కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తారన్నది చూడాలి. కేవలం బాబుకు మద్దతుగానే కాకుండా బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా కేసీఆర్ ఎలాంటి అభ్యంతరాలు చెప్పే అవకాశం లేదన్నది ఈ ఎమ్మెల్యేలు తీరుగా కనిపిస్తోందని టాక్.
This post was last modified on September 14, 2023 4:43 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…