రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి పేరు, విజన్ ఉన్న నాయకుడిగా మంచి హవా సొంతం చేసుకున్న ఏకైక నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయనంటే ఎంతో గౌరవం. ఎంతో మర్యాద ఇచ్చే దేశాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి నాయకుడు, పైగా 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఐటీకి కేంద్రంగా మారిన వ్యక్తిని అరెస్టు చేయడం, రాత్రికి రాత్రికి జైలుకు తరలించడం వంటి పరిణామాలను అంత తేలికగా తీసుకునే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు.
అయితే, ఇంత జరగడం వెనుక.. కేవలం వైసీపీ ప్రభుత్వ పాత్ర ఒక్కటే లేదన్నది పొలిటికల్‌గా ఇప్పుడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చగా విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో పాగా వేయాలని కలలు కంటున్న కేంద్రంలోని బీజేపీ పెద్దల దన్ను లేకుండా.. రాష్ట్రంలో వైసీపీ సర్కారు చంద్రబాబు వంటి బలమైన ప్రజాదరణ, అంతకు మించిన విజన్ ఉన్న నాయకుడిని అరెస్టు చేసే సాహసం చేయబోదన్నది రాజకీయ పండితుల మాట. పైగా.. వచ్చే ఎన్నికలకు సమయం కూడా చేరువ అయిన నేపథ్యంలో ఇలాంటి సాహసానికి వడిగట్టే ప్రయత్నం చేయదని చెబుతున్నారు.
ఇదంతా కూడా.. కేంద్రంలోని పెద్దల స్కెచ్
గా కొందరు రాజకీయ పండితులు చెబుతున్నారు. ఏపీలో టీడీపీని విచ్ఛిన్నం చేయడం ద్వారా.. ఇక్కడ బీజేపీని బలోపేతం చేసుకునే కుట్ర ఏదో జరుగుతోందన్న ది రాజకీయంగా తలపండిన నాయకులు చెబుతున్న మాట. దీనిలో భాగంగానే రాష్ట్ర సర్కారు భుజంపై నుంచి తుపాకీని పేలుస్తున్నట్టు వారు సందేహిస్తున్నారు. పైగా.. చంద్రబాబు విజన్‌ను కొన్ని నెలల కిందట మెచ్చుకున్న పీఎం మోడీ… ఇప్పుడు కనీసం.. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయంలో ఎందుకు రియాక్ట్ కాలేదన్నది కూడా ఈ సందేహాలకు తావిస్తోందన్నది రాజకీయ పండితుల మాట.
మరోవైపు.. చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని చెప్పిన రాష్ట్ర బీజేపీ నాయకులు.. బంద్‌కు మాత్రం సహకరించేది లేదని చెప్పడం వెనుక కేంద్రంలోని పెద్దల నుంచి వచ్చిన సూచనలు ఉన్నాయనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయని రాజకీయ నాయకులు, విశ్లేషకులు అనుమానిస్తున్నారు. దీనికి ముందు కూడా.. 118 కోట్ల రూపాయల విషయంపై ఐటీ నోటీసులు ఇవ్వడం.. ఆ వెంటనే సీఐడీ.. స్కిల్ కుంభకోణం అంటూ.. కేసు పెట్టడం వంటి పరిణామాలను గమనిస్తే.. బాబు అరెస్టు, రిమాండ్ వెనుక.. ఏదో జరుగుతోందని స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఏది నిజమో తేలాలంటే.. కొన్నాళ్లు వెయిట్ చేయకతప్పదేమో!!
This post was last modified on September 11, 2023 2:33 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…