టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు, రిమాండ్, జైలుకు తరలింపు విషయాలు ఆంధ్రప్రదేశ్ తో పాటు జాతీయ రాజకీయాల్లోనూ సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు 14 రోజుల రిమాండ్ లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పుడు న్యాయ పోరాటానికి టీడీపీ సిద్ధమైంది. సోమవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. అంతే కాకుండా యువ నాయకుడు, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సారథ్యంలో ముందుకు సాగుతామని టీడీపీ నాయకులు అంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ తమ పోరాటానికి నేత్రుత్వం వహిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీలో లోకేష్ తో ఎవరున్నారు? ఆయనకు వ్యతిరేక వర్గం ఎవరో బయటపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీలో ఇప్పటికే లోకేష్ అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బలాన్ని చేకూర్చేలా కొన్ని సంఘటనలు కూడా జరిగాయని చెప్పొచ్చు. పార్టీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా ఉండే కొంతమంది సీనియర్ నేతలు.. యువ నాయకుడు లోకేష్ విషయంలో మాత్రం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే టాక్ ఉంది.
అంతే కాకుండా పార్టీలో లోకేష్ కు ప్రత్యేకంగా ఓ వర్గం ఉందని కూడా చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పార్టీలోని సీనియర్ నాయకులే లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదంతాలున్నాయని అంటున్నారు. ఇక ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర వైపు ఇద్దరు టీడీపీ ఎంపీలు కన్నెత్తి కూడా చూడలేదనే వ్యాఖ్యలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ లోకేష్ ను పట్టించుకోని ఆ ఇద్దరు ఎంపీలు మాత్రం.. బాబుతో సన్నిహితంగానే మెలుగుతున్నారు. మరి ఇలాంటి నాయకులు ఇప్పుడు న్యాయ పోరాటంలో లోకేష్ ఆధ్వర్యంలో పని చేస్తారా? అన్నది సందేహంగా మారిందని టాక్. దీంతో లోకేష్ తో ఎవరున్నారో ఇప్పుడు తేలిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on September 11, 2023 4:04 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…