స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పటి నుంచి టీడీపీ కార్యకర్తలు, నేతలతోపాటు సామాన్యులను సైతం తొలిచివేస్తున్న ప్రశ్న ఒక్కటే. 2021లో ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైతే ఇప్పుడు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? గతంలో ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదు ఇప్పుడు తాజాగా ఆయన పేరు చేర్చి అంత హడావిడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ నేపథ్యంలోనే తాజాగా ఏసీబీ కోర్టులో వాదనల సందర్భంగా న్యాయమూర్తికి కూడా ఇవే సందేహాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ సిఐడి అధికారులను, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని న్యాయమూర్తి ఇవే ప్రశ్నలు అడిగారు.
ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును తాజాగా చేర్చడంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి…సీఐడీ, ఏఏజీకి ప్రశ్నలు సంధించారు. గతంలోని ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు పేరు ఎందుకు చేర్చారో చెప్పాలని నిలదీశారు. ఈ స్కామ్ లో చంద్రబాబు ప్రమేయంపై తగిన ఆధారాలున్నాయా అని ఏఏజీని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.లాజికల్ గా జడ్జి అడిగిన ప్రశ్నలకు సీఐడీ అధికారులు,ఏఏజీ సుధాకర్ రెడ్డి ఖంగుతిన్నారని తెలుస్తోంది. ఆ ప్రశ్నల తర్వాత పది నిమిషాల పాటు వాదనలకు న్యాయమూర్తి బ్రేక్ ఇచ్చారు.
మరోసారి లూథ్రా వాదనలు విన్న తర్వాత చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీ, బెయిల్ పై కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు కోర్టు హాల్‌లో వేచి చూస్తున్నారు. కోర్టుకు వచ్చిన నారా లోకేష్ ఈ కేసుపై ఎలా ముందుకెళ్లాలి..? అని టీడీపీ నేతలు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది. చంద్రబాబుతో కూడా లోకేష్ సమావేశమైనట్లు తెలుస్తోంది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…