Political News

‘రూటు’ మార్చిన జ‌న‌సేనాని… రోడ్డు మార్గంలో విజ‌య‌వాడ‌కు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రోడ్డు మార్గంలో ప్ర‌త్యేక కాన్వాయ్ ద్వారా హైద‌రాబాద్ నుంచి విజ‌యవాడ కు బ‌య‌లు దేరారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన ద‌రిమిలా విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టులో చంద్ర‌బాబును ప్ర‌వేశ పెట్టేందుకు పోలీసులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ స‌మ‌యంలోనే చంద్ర‌బాబును ప‌రామ‌ర్శించేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజ‌య‌వాడ‌కు బ‌య‌లు దేరుతున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చాయి. హైద‌రాబాద్‌లోని బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ప్ర‌త్యేక విమానంలో విజ‌య‌వాడ‌కు వ‌చ్చేందుకు రెడీ అయ్యారు. అయితే, పవన్ కళ్యాణ్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరడానికి సిద్ధమైన ప్రత్యేక విమానాన్ని టేకాఫ్ కాకుండా కృష్ణా జిల్లా పోలీసులు అడ్డుకున్నారు.

పవన్ కళ్యాణ్ ప్ర‌యాణించేందుకు రెడీ అయిన విమానాన్ని గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ కాకుండా చూడాలంటూ.. విమానాశ్ర‌య అధికారుల‌కు కృష్ణా జిల్లా ఎస్పీ లేఖ రాశారు. దీంతో విమానాశ్ర‌య అధికారులు ల్యాండింగ్ పర్మిషన్ లేదంటూ.. వ‌ర్త‌మానం పంపించారు. దీంతో జ‌న‌సేన అధినేత ప్ర‌యాణించాల్సిన ప్ర‌త్యేక విమానం బేగంపేట‌లోనే నిలిచిపోయింది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రోడ్డు మార్గంలో హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక కాన్వాయ్‌తో విజ‌య‌వాడ‌కు బ‌య‌లు దేరారు. అయితే.. రోడ్డు మార్గంలోనూ ఆయ‌న‌ను ఏపీ స‌రిహ‌ద్దు వ‌ద్ద అడ్డుకునేం దుకు వంద‌ల మంది పోలీసులు మోహ‌రించ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో పంతంగి టోల్ ప్లాజా వ‌ద్ద ఎటు చూసినా పోలీసులే క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 9, 2023 10:17 pm

Share

Recent Posts

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

4 minutes ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

41 minutes ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

2 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

3 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

4 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

5 hours ago