టీడీపీ అధినేత, విపక్ష నాయకుడు, పైగా సొంత వియ్యంకుడు నారా చంద్రబాబు అరెస్టుపై నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడని, అందుకే చంద్రబాబు వంటి వారిని కనీసం 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే అరెస్టు చేశారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను పాలించేందుకు అధికారంలోకి రాలేదని, ప్రతిపక్షాలపై కక్ష సాధిచేందుకు వచ్చాడని విరుచుకుపడ్డారు.
టీడీపీ అధినేత, 14 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్ట్ దుర్మార్గమని బాలయ్య వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని యెద్దేవా చేశారు.
‘‘నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ కక్ష్యసాధిస్తున్నారు’’ అని బాలయ్య నిప్పులు చెరిగారు. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారని నిలదీశారు.
స్కిల్‌డెవలప్‌మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇది కావాలని రాజకీయ కక్షతో చేస్తున్న కుట్రగా నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. 2021 డిసెంబర్ 19లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని, నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జ్‌షీట్ దాఖలు చేయలేదని బాలయ్య నిలదీశారు.
ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబుని అరెస్ట్ చేశారని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని.. ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
This post was last modified on September 9, 2023 12:18 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…