మూడు రోజుల క్రితం చెప్పినట్లే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు అయ్యారు. స్కిల్ డెవలెప్ మెంట్ కేసుకు సంబంధించి బాబును 37వ ముద్దాయిగా చూపించారు. ఆయనపై సీఐడీ దాఖలు చేసిన ఆరోపణలతో ఆయన్ను అదుపులోకి తీసుకోవటం ద్వారా ప్రభుత్వం ఇరుకున పడిందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఏపీ విపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసే విషయంలో సీఐడీ తొందరపాటుకు గురైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా అని తప్పు చేస్తే.. చూస్తూ వదిలేయమని చెప్పటం లేదు. కానీ.. ఆచితూచి అన్నట్లుగా తీసుకోవాల్సిన నిర్ణయాల్ని దూకుడు ప్రదర్శించటం తప్పే అవుతుందంటున్నారు.
సాంకేతికంగా చూస్తే.. చట్టబద్ధంగానే చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ.. అరెస్టు చేసే టైం విషయంలో తప్పులో కాలేసిందన్న మాట వినిపిస్తోంది. ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. అరెస్టు చేయాల్సిన అవసరం ఉందన్న విషయంపై క్లారిటీ వచ్చేసిన తర్వాత ఆగాల్సిన అవసరం లేదు. కాకుంటే.. అరెస్టు చేసే వ్యక్తి ఉమ్మడి రాష్ట్రానికి.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించి ఉండటం.. విపక్ష పార్టీకి అధినేతగా ఉండటం.. పెద్ద వయస్కుడిగా ఉన్న వేళ.. అలాంటి అధినేతను అరెస్టు చేయాలన్న ఆలోచనకు సీఐడీ వస్తే.. అందుకు తగ్గట్లు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందన్న మాట వినిపిస్తోంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును తప్పనిసరిగా అరెస్టు చేయాలంటే చేయాలి. చేయకూడదని వాదించట్లేదు. కానీ.. అరెస్టు చేసే వేళలో కొంత ముందు వెనుకా చూసుకొని వ్యవహరించి ఉంటే బాగుండేది. అంత పెద్ద నాయకుడ్ని అరెస్టు చేయటానికి శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాతే అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది? వయసును పరిగణలోకి తీసుకొని ఉదయం వేళలో అదుపులోకి తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అర్థరాత్రి దాటిన తర్వాత విశ్రాంతిలో ఉన్న వేళలో.. అధికారులు వెళ్లి మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నామన్న మాటను ఉదయం ఏడు గంటల వేళలో చెప్పినా పెద్ద తేడా ఏమీ ఉండదు కదా? అర్థరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు బస చేసిన నంద్యాలకు అధికారులు వెళ్లి.. ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్నట్లుగా ప్రకటించటం.. ఉదయం టిఫిన్ పూర్తి అయిన తర్వాత విజయవాడకు తరలించేందుకు వీలుగా సీఐడీ అధికారులు ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇదే ప్రొసీజర్ ను శనివారం ఉదయం చేసి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. చంద్రబాబు అరెస్టుతో సీఐడీ అధికారుల అడుగు ప్రభుత్వానికి సెల్ఫ్ గోల్ గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. ఇంత పెద్ద వయసులో అరెస్టు అన్నంతనే.. రాజకీయ శత్రుత్వం కీలక భూమిక పోషించినట్లుగా చెప్పొచ్చు. దీనికి తోడు.. తన అరెస్టును చంద్రబాబు ముందే అంచనా వేసి.. ఆ విషయాన్ని చెప్పేయటం తెలిసిందే. అలాంటప్పుడు కాస్తంత ఆగి అదుపులోకి తీసుకోవటాన్ని తప్పు పడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న వేళలో జరిగిన ఈ అరెస్టు రాజకీయ కలకలానికి కారణంగా మారిందంటున్నారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే. కాకుంటే.. అదేమీ పట్టుపట్టి.. టార్గెట్ చేసి మరీ అరెస్టు చేసిన భావన కలగటంలోనే అసలు ఇబ్బందంతా. ఈ విషయంలో చంద్రబాబును తొందరపాటుతో అరెస్టు అయ్యారన్న సానుభూతి ప్రజల్లోకి వెళ్లేందుకు కారణమవుతుందని చెబుతున్నారు. మరి.. ఏ లెక్కలో సీఐడీ అధికారులు చంద్రబాబును అర్థరాత్రి దాటిన తర్వాత అదుపులోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
This post was last modified on September 9, 2023 9:52 am
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…