Political News

విద్యుత్ చార్జీలు పెంచ‌బోం: చంద్ర‌బాబు హామీ!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని, ఏపీలో అధికారం చేప‌ట్టాల‌ని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్ర బాబు.. దానికి అనుగుణంగానే అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోతున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల వ‌రాలు కూడా ఇస్తున్నారు. మేలో జ‌రిగిన మ‌హానాడులో ప్ర‌క‌టించిన మినీ మేనిఫెస్టోలో మ‌హిళ‌ల‌పై అనేక వ‌రాలు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే.. అక్క‌డితో కూడా ఆగ‌కుండా.. తాజాగా కీల‌క‌మైన విద్యుత్ చార్జీల విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు.

ప్ర‌స్తుతం నాలుగేళ్ల పాల‌న‌లో సీఎం జ‌గ‌న్ విద్యుత్ చార్జీల‌ను 12 సార్లు పెంచార‌ని.. త‌మకు అధికారం ఇస్తే.. వ‌చ్చే ఐదేళ్ల కాలంలో ఒక్క‌సారి కూడా విద్యుత్ చార్జీల‌ను పెంచ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మహిళలతో ప్రజావేదిక’ కార్యక్రమంలో బాబు మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని.. సౌర, పవన విద్యుత్‌ను తీసుకొస్తామని, త‌ద్వారా విద్యుత్ ధ‌ర‌లు త‌గ్గిన ఆశ్చ‌ర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు.

పేదవాళ్లను ఆర్థికంగాపైకి తీసుకొచ్చి.. వాళ్లను ధనికులను చేయాలని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. దేశంలోను రాష్ట్రంలోనూ ధ‌నికులు ఎక్కువవుతున్నారని చంద్ర‌బాబు చెప్పారు. పేదవాళ్లు మాత్రం బాగుపడట్లేదని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలోనే ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌న్నారు.

పేదవాళ్లందరినీ భాగస్వాములను చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ప్రజల ద్వారా సంపద సృష్టించి వారిని ధనికులను చేయాల‌న్నారు. అనేక ఆలోచనలు చేసి అభివృద్ధికి నాంది పలకాలని, సమర్థత పెంచడానికి, ప్రైవేటు పెట్టుబడులు తీసుకురావడానికే ఆర్థిక సంస్కరణలు వచ్చాయని వివ‌రించారు. “డబ్బు, భూమి కాదు.. ప్రజలే నా ఆస్తి’’ అని చంద్రబాబు ప్ర‌క‌టించారు.

This post was last modified on September 8, 2023 2:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago