రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు విషయం వామపక్షాలకు ఎంతకీ తెగటం లేదు. అసలు కమ్యూనిస్టులతో పొత్తు వద్దని చాలామంది సీనియర్లు పదేపదే చెబుతున్నారు. ఎందుకంటే పొత్తుల్లో కమ్యూనిస్టులకు ఇచ్చే సీట్లతో పోటీచేసే అవకాశం తమకు ఎక్కడ చేజారిపోతుందో అనే టెన్షన్ చాలామందిలో పెరిగిపోతోంది. ఈ కారణంతోనే కేసీయార్ కమ్యూనిస్టులతో పొత్తు వద్దు పొమ్మంది. కేసీయార్ తరిమేస్తేనే తమ దగ్గరకు వచ్చిన కమ్యూనిస్టులతో తామెందుకు పొత్తు పెట్టుకోవాలని వాదించే సీనియర్లు కూడా ఉన్నారు.
అందుకనే పొత్తు విషయం ఎటూ తేలటంలేదు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తమకు ఐడు అసెంబ్లీ సీట్లు కావాలని ప్రతిపాదించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. కొత్తగూడెం, వైరా, మునుగోడు, బెల్లంపల్లి, హుస్నాబాద్ నియోజకవర్గాలు కావాలని అడిగారట. అయితే ఈ నియోజకవర్గాలను ఇచ్చే ఉద్దేశ్యంలో కాంగ్రెస్ లేదు. అసలు సీపీఐ అడిగినట్లుగా ఐదు స్ధానాలు సాధ్యంకాదని కూడా ఇంటర్నల్ టాక్ వినబడుతోంది.
కమ్యూనిస్టులతో పొత్తులు తప్పదని కాంగ్రెస్ అనుకుంటే మహాయితే ఎక్కడో ఒక నియోజకవర్గం ఇస్తే సరిపోతుదని సీనియర్లు బలంగా వాదిస్తున్నారు. ఎందుకంటే సీపీఐ అడిగినన్ని సీట్లిస్తే వెంటనే సీపీఎం కూడా తయారవుతుంది. కాంగ్రెస్ తో పొత్తు గురించి మాట్లాడుతున్నది ఇపుడు సీపీఐ ఒక్కటే. పొత్తు ఖరారైతే వెంటన సీపీఎం కూడా రంగంలోకి దిగుతుంది.
సీపీఐకి ఐదుసీట్ల ఇస్తే అదే పద్దతిలో సీపీఎంకు కూడా ఐదు సీట్లివ్వాల్సిందే అని సీనియర్లు టెన్షన్ పడుతున్నారు. అసలే పోటీచేయటం కోసం పార్టీలోనే విపరీతమైన పోటీ పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో కమ్యూనిస్టులకు పదిసీట్లను వదులుకోవటం అంటే మామూలు విషయంకాదు. అందుకనే అసలు కమ్యూనిస్టులతో పొత్తువద్దని తప్పనిసరిలో పెట్టుకోవాల్సొస్తే ఎక్కడో చెరో నియోజకవర్గాన్ని కేటాయించాలని సీనియర్లంటున్నారు. అయితే ఆ రెండు నియోజకవర్గాలు ఏవి అనేది కూడా పెద్ద సమస్యగా మారేట్లుంది. అందుకనే కమ్యూనిస్టులతో పొత్తు చర్చలు ఎంతకీ తెగటంలేదు. మరి చివరకు ఏమవుతుందో ఏమో చూడాల్సిందే.
This post was last modified on September 8, 2023 2:18 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…