ధర్మాన కృష్ణదాస్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం కూడా. అయితే.. ఇప్పుడు ఆయన తీవ్ర ఫ్రెస్ట్రేషన్‌లో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పార్టీని గెలుపు గుర్రం ఎక్కించాలి. పైగా ఆయన జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీంతో ఆయనపై ఎక్కడాలేని ఒత్తిడి పెరిగిపోయినట్టు కనిపిస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో ధర్మాన అనుకున్నట్టుగా పరిస్తితి అయితే లేదు.
నిజానికి శ్రీకాకుళం జిల్లాకు ఇటు వైసీపీ పార్టీపరంగాను, అటు జగన్ ప్రభుత్వం పరంగాను కీలకప్రాధాన్యం ఇస్తున్నారు. ఇద్దరు నాయకులకు మంత్రి పదవులు ఇచ్చారు. అదేవిధంగా ఏడుగురికి కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే.. శ్రీకాకుళం జిల్లాకు దక్కిన పదవులు భేష్ అనే చెప్పాలి. దీనికి కారణం.. ఇక్కడ బలమైన టీడీపీని ఢి కొట్టి.. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనేది సీఎం జగన్ లక్ష్యం.
అయితే.. ఈ లక్ష్య సాధన విషయంలోనే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కృష్ణదాస్.. టెన్షన్ పడుతున్నారు. ఎవరూ ఆయన మాట వినిపించుకోవడం లేదనే టాక్ సొంత వర్గంలోనే వినిపిస్తోంది. పైగా సొంత పార్టీ నేతలపైనే అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ ఎమ్మెల్యే లేదా, ఇంచార్జ్‌లపై అసంతృప్తి కనిపిస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులను ఓడించేందుకు సొంత నేతలే రెడీగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
దీంతో ఈ పరిణామాలను చక్కదిద్దేందుకు ధర్మాన కృష్ణదాస్ ప్రయత్నిస్తున్నా.. ఎవరూ కూడా ఆయన మాటను వినిపించుకోవడం లేదనే మాట పార్టీలో వినిపిస్తోంది. కానీ, మరోవైపు పార్టీ అధిష్టానం మాత్రం దాస్‌పైనే భారం వేసేసింది. జిల్లాలో పార్టీని గెలిపించే బాధ్యతను ఆయనకే అప్పగించింది. ఈ నేపథ్యంలోనే కృష్ణదాస్ ఇటీవల తీవ్ర ఒత్తిడితో ఉన్నట్టు కనిపిస్తున్నారని.. ఆయన వర్గం నాయకులు అంటున్నారు. మరి ఈ టెన్షన్ ఎప్పటికీ తీరుతుందో చూడాలి.
This post was last modified on September 8, 2023 9:41 am
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…