ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు తెర తీసిన సంగతి తెలిసిందే. టిడిపి సానుభూతిపరుల ఓట్లను తొలగించడం, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారి ఓట్లను జాబితాలో చేర్చడం వంటి అవకతవకలకు కొందరు అధికారులు పాల్పడుతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన ఫిర్యాదు సంచలనం రేపింది. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు…అందుకు బాధ్యులైన ఇద్దరిని సస్పెండ్ కూడా చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఫిర్యాదు కూడా చేశారు. ఇక, వాలంటీర్లను ఓట్ల జాబితా, ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించవద్దంటూ కోర్టు ఆదేశాలున్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం వాలంటీర్లతో ఆ పని చేయిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా నెల్లూరు జిల్లా సంగంలో ఓటర్లు జాబితా వ్యవహారంపై వాలంటీర్ల సమావేశం జరిగిందన్న ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండల కేంద్రంలో స్థానిక వాలంటీర్లతో వైసీపీ నాయకులు సమావేశమయ్యారు. ఓట్ల తొలగింపుపైనే ఆ సమావేశం జరుగుతుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అక్కడికి వెళ్లి వారిని నిలదీశారు. అధికారులు ఎవరూ లేకుండా వైసిపి నాయకులు వాలంటీర్లతో సమావేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు.
తమను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో అక్కడి నుంచి వైసీపీ నాయకులు, వాలంటీర్లు మెల్లగా జారుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆ ఘటనను ఫోటోలు, వీడియోలు తీసిన టిడిపి నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకువెళ్తామని అన్నారు. కృష్ణాష్టమి సెలవు రోజున వాలంటీర్లకు పని ఏంటని, అందులోను వైసిపి నేతలతో వారు ఎందుకు సమావేశం అయ్యారని ఆనం నిలదీశారు. ఆ సమావేశంలో అధికారులు ఎవరూ ఎందుకు లేరని ప్రశ్నించారుజ వెంకటగిరి ఎమ్మెల్యే అయిన ఆనం రాబోయే ఎన్నికల్లో టిడిపి తరఫున ఆత్మకూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో, ఆత్మకూరులో ఈ దొంగ ఓట్ల అవకతవకలపై ఆనం కొంతకాలంగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారం గుట్టు రట్టయింది.
This post was last modified on September 7, 2023 8:03 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…