రామోజీరావుపై కక్ష సాధించేందుకే మార్గదర్శి చిట్ ఫండ్స్ ను సీఎం జగన్ టార్గెట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. రామోజీరావుతోపాటు ఆయన కోడలు శైలజా కిరణ్ లను హైదరాబాదులో సిఐడి అధికారులు విచారణ జరిపారు. ఆ తర్వాత శైలజా కిరణ్ తనపై లుకౌట్ నోటీసు జారీ చేయడం, 798 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేయడం వంటి ఘటనలపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఏపీ సిఐడి అధికారులపై తెలంగాణ హైకోర్టు అసహనం కూడా వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను బేఖాతరు చేసి ఎందుకు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఇదిలా ఉండగానే తాజాగా మరోసారి మార్గదర్శి చిట్ ఫండ్స్ పై ఏపీ సిఐడి ఏడీజీ సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.
మార్గదర్శిపై అన్నపూర్ణ దేవి అనే మహిళ ఫిర్యాదు చేశారని, ఆమెతో 90 చిట్స్ వేయించి 210 రూపాయలు చేతిలో పెట్టినట్లు తమకు ఫిర్యాదు అందిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ ఏడీజీతో కలిసి మీడియాతో మాట్లాడిన అన్నపూర్ణాదేవి కూడా మార్గదర్శిపై సంచలన ఆరోపణలు చేశారు. ఎనిమిదేళ్లుగా మార్గదర్శిలో చిట్స్ వేస్తున్నానని, ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని అన్నపూర్ణాదేవి అన్నారు. మొదట్లో బాగానే డబ్బులు ఇచ్చారని, ఆ తర్వాత ఒత్తిడి చేసి దాదాపు 90 చిట్స్ వేయించుకున్నారని ఆమె ఆరోపించారు. చివరికి తాను వేసిన చిట్టి డబ్బులు కూడా ఇవ్వలేదని, 17 చిట్స్ లో తనను డిఫాల్ట్ చేశారని ఆమె ఆరోపించారు. అన్ని చిట్స్ వేసిన తర్వాత చివరకు 210 రూపాయల వచ్చాయని, అందుకే కేసు పెట్టానని ఆమె చెప్పారు.
అన్నపూర్ణాదేవి వంటి బాధితులు ఎంతోమంది ఉన్నారని, అనేక నిబంధనలను మార్గదర్శి అతిక్రమించిందని ఆయన చెప్పారు. ఈ మోసాల గురించి ప్రజలకు తెలియాలని, కోట్ల రూపాయలు కట్టిన బాధితులు వేలల్లో మాత్రమే రిటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. దాదాపు 3000 మందికి అసలు తాము చిట్ వేసిన సంగతే తెలియదని సంచలన ఆరోపణలు చేశారు. 100 మంది ఘోస్ట్ ఖాతాదారులను గుర్తించి విచారణ జరిపామని అన్నారు. వారికి తెలియకుండా వారి ఆధార్, ఇతర వివరాలను మార్గదర్శి వాడుకుంటుందని సంజయ్ ఆరోపించారు. అన్ని రూల్స్ పాటిస్తున్నామని ఖాతాదారులను మార్గదర్శి మోసం చేస్తుందని ఆయన ఆరోపణలు చేశారు.
ఆక్షన్ తేదీని నెలలపాటు పొడిగిస్తున్నారని, 40 శాతం చిట్ గ్రూపులలో చందాదారులే లేరని ఆయన ఆరోపించారు. కంపెనీయే సొంతగా చిట్స్ తీసుకుంటుందని, చెక్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా లెడ్జర్లో వివరాలు నమోదు చేయడం లేదని ఆరోపించారు. ఇక, సిఐడి విచారణను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు సంజయ్.
This post was last modified on September 7, 2023 6:19 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…