ఇపుడిదే చర్చ బీఆర్ఎస్ లో పెరిగిపోతోంది. మొదటినుండి బీఆర్ఎస్ కు ఖమ్మం జిల్లా కొరకరాని కొయ్యలాగే ఉంది. ఎంతో ఉధృతంగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం జరుగుతున్నపుడు కూడా ఖమ్మం జిల్లాలో దాని ప్రభావం దాదాపు నిల్లనే చెప్పాలి. అలాంటిది తెలంగాణా సాధన తర్వాత 2014లో జరిగిన మొదటి ఎన్నికలో కూడా టీఆర్ఎస్ ప్రభావం ఏమీలేదు. జిల్లాలోని పది నియోజకవర్గాలను కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలే గెలుచుకున్నాయి.
దాంతో ఇక లాభంలేదని అనుకున్న కేసీయార్ వెంటనే ప్రలోభాలకు, ఒత్తిళ్ళకు దిగేసి ఎంఎల్ఏలను లాగేసుకున్నారు. తర్వాత 2018లో జరిగిన రెండో ఎన్నికలో కూడా ఖమ్మంలో మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. మిగిలిన అన్నింటిలోను కాంగ్రెస్, టీడీపీలు పంచుకున్నాయి. అందుకనే కొంతమంది ఎంఎల్ఏలను పార్టీలోకి కేసీయార్ లాగేసుకున్నారు. జిల్లాలో బీఆర్ఎస్ పరిస్ధితి ఏమిటో కేసీయార్ కు బాగా తెలుసు. అలాంటపుడు తుమ్మల నాగేశ్వరరావును దూరం ఎందుకు చేసుకుంటున్నారో అర్ధంకావటంలేదు.
పాలేరులో తుమ్మలకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన కందాళం ఉపేందరరెడ్డికి ఇచ్చారు. దాంతో అలిగిన తుమ్మల తొందరలో కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయి. తుమ్మల కాంగ్రెస్ లో చేరటం దాదాపు నిర్ణయమైపోయింది కానీ ఎందుకనో వాయిదాపడుతోంది. ఇపుడు తుమ్మల కాంగ్రెస్ లో చేరితే జరగబోయే నష్టమెంత అని కేసీయార్ సమీక్షలు నిర్వహిస్తే ఉపయోగం ఏమిటి ? తుమ్మలకు టికెట్ అన్నా ఇవ్వాలి లేదా ముందుగానే పిలిపించుకుని నచ్చచెప్పి బుజ్జగించాలి. రెండు చేయకపోగా ఉంటే ఉండు పోతే పో అన్నట్లుగా వ్యవహరించారు.
తుమ్మల కాంగ్రెస్ లో చేరితే జిల్లా వ్యాప్తంగా బలమైన అనుచరగణం బీఆర్ఎస్ కు దూరమవ్వటం ఖాయం. అసలే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరటంతో బీఆర్ఎస్ కొన్ని నియోజకవర్గాల్లో వీకైపోయింది. ఇపుడు తుమ్మల కూడా మారిపోతే పార్టీ కత అంతే సంగతులు. తుమ్మలకు తోడు జలగం వెంకటరావు కూడా వెళిపోతే కొత్తగూడెం పరిధిలో బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవనే అనుకుంటున్నారు. హోలు మొత్తం మీద ఖమ్మంను స్వీప్ చేయాలన్న కేసీయార్ కల కలగానే చివరికి మిగిలిపోతుందేమో.
This post was last modified on September 7, 2023 2:07 pm
ఒక చిన్న టీజర్ కోసం ఫ్యాన్స్ ఇంతగా ఎదురు చూడటం మెగా ఫ్యాన్స్ కు పెద్ది విషయంలోనే జరిగింది. కొత్త…
పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో విసిగిపోయింది. తాజాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో 0-3 తేడాతో ఓడిన తర్వాత అభిమానుల…
ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఆశించినంత బాగాలేదు. తొలి మ్యాచ్లో పరుగుల వర్షం కురిపించిన జట్టు, ఆ…
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలకు తెర లేసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సహా వాణిజ్య రాజధాని న్యూయార్క్……
గత ఏడాది డిసెంబర్ అన్నారు. తర్వాత ఏప్రిల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు దసరా లేదా దీపావళికి రావడం అనుమానమే అంటున్నారు.…