Political News

కేసీయార్ ను వెంటాడుతున్న రుణమాఫీ

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కేసీయార్ను రుణమాఫీ పీడకలలాగ వెంటాడుతోంది. 2018 ఎన్నికల్లో గెలుపుకు రైతులకు రుణామాఫీ చేస్తానని కేసీయార్ హామీ ఇచ్చేశారు. గెలిచిన తర్వాత ఇంతకాలం చప్పుడు చేయలేదు. అలాంటిది నెలక్రితం సడెన్ గా రుణమాఫీ గుర్తుకొచ్చింది. ఎందుకంటే మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా అందుకనే. రుణమాఫీ జరగకపోతే రైతులు ఎలా రియాక్టవుతారో కేసీయార్ కు బాగా తెలుసు. అందుకనే హడావుడి చేసి ఉన్నతాధికారుల నెత్తిన కూర్చుని నిధుల సేకరణ మొదలుపెట్టారు.

ప్రభుత్వం లెక్కల ప్రకారం రుణాలు అందుకోవాల్సిన రైతుల సంఖ్య 40 లక్షలు. వీరిలో రు. 99,999 రుణమున్న వాళ్ళ సంఖ్య సుమారు 11 లక్షలు. లక్ష రూపాయలు రుణం ఉన్నవాళ్ళు మరో 20 లక్షలుంటారు. హోలుమొత్తం అనర్హులని తేల్చిన రైతుల సంఖ్య సుమారు 4 లక్షలు. మిగిలిన ఐదు లక్షల మంది రైతులు లక్ష రూపాయలకన్నా ఎక్కువ రుణం ఉన్న రైతులు. నానా అవస్తలు పడి రు. 99,999 అప్పున్న రైతులు 10 లక్షల మందికి మాఫీ జరిగిపోయింది.

మరి లక్ష రూపాయలు, అంతకుమించి అప్పున్న 25 లక్షల రైతుల మాటేమిటి ? అనే ప్రశ్న మొదలైంది. వాళ్ళ ఆప్పులు తీర్చటానికే కేసీయార్ ఇపుడు నానా అవస్తలు పడుతున్నారు. ఎక్కడెక్కడి నిధులు తీసుకొచ్చి ఇపుడు 25 లక్షల రైతుల అప్పులు తీర్చటానికే ప్రాధాన్యతిస్తున్నారు. మొత్తం అప్పును ఈనెలాఖరులోగా తీర్చేయాలన్నది కేసీయార్ టార్గెట్.

25 లక్షల మంది రైతుల అప్పులు తీరాలంటే ప్రభుత్వం రు. 13 వేల కోట్లు జమచేయాలి. ఇప్పటికి తీర్చింది సుమారు రు. 2 వేల కోట్లు మాత్రమే. ఇంకా 11 వేల కోట్ల రూపాయలను ఎలా సేకరించాలో కేసీయార్ కు అర్ధంకావటంలేదు. ఆదాయార్జన శాఖల ఉన్నతాధికారులను ఒకటే బాదుడు మొదలుపెట్టారు. మొత్తానికి నోటికొచ్చినట్లుగా హామీలిచ్చేస్తే నిధులు లేకపోతే పరిస్ధితి ఎలాగుంటుందనేందుకు కేసీయార్ ప్రభుత్వమే ఉదాహరణ. తెలంగాణాయే కాదు ఏపీ, తమిళనాడు, కర్నాటక ఏ ప్రభుత్వం తీసుకున్నా ఇదే పరిస్ధితి. వీళ్ళిచ్చే ఉచిత హామీలు, రుణమాఫీ హామీలతో ప్రభుత్వాలు నానా అవస్తలు పడుతున్నాయి. ఈ పరిస్ధితి ఎప్పటికి మారుతుందో ఏమో.

This post was last modified on September 6, 2023 12:27 pm

Share

Recent Posts

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

6 minutes ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

48 minutes ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

1 hour ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

1 hour ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

2 hours ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

2 hours ago