తెలంగాణా నేత డీకే అరుణ విచిత్రమైన పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. విచిత్రం ఏమిటంటే గద్వాల అభ్యర్ధిగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఆమెపై గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్ధి కృష్ణమోహన్ రెడ్డిని హైకోర్టు ఈమధ్యనే అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం హైకోర్టు గనుక ఎంఎల్ఏని లేదా ఎంపీని అనర్హుడిగా ప్రకటిస్తే ఓడిపోయిన అభ్యర్ధులను గెలిచినట్లు ప్రకటించాలి. సో హైకోర్టు తీర్పు ప్రకారం కృష్ణమోహన్ అనుర్హుడవ్వటంతో డీకే అరుణే ఎంఎల్ఏ అయిపోయారు.
డీకే అరుణే ఎంఎల్ఏగా కోర్టు ప్రకటించేసింది. అయితే అప్పట్లో ఓడిపోయిన డీకే తర్వాత రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఇపుడు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కూడా. అంటే డీకే ఉన్నదేమో బీజేపీలో. కానీ ఎంఎల్ఏ అయ్యింది మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపున. మామూలుగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే చాలామంది ఒకపార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు మరోపార్టీలోకి ఫిరాయించేస్తున్నారు.
అయితే వాళ్ళ వ్యవహారం ఎలాగుందంటే వాళ్ళేమీ తాము గెలిచిన పార్టీలకు రాజీనామాలు చేయలేదు. కాంగ్రెస్ తరపున ఎంఎల్ఏలుగా గెలిచిన 12 మంది పార్టీకి రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ లో చేరిపోయారు. కానీ డీకే అలాకాదు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరారు. అంటే సాంకేతికంగా ఆమెకు కాంగ్రెస్ పార్టీకి ఇపుడు ఎలాంటి సంబంధంలేదు. కానీ హై కోర్టు తీర్పుప్రకారం ఆమె కాంగ్రెస్ ఎంఎల్ఏనే.
ఇక్కడే డీకే విచిత్రమైన పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. బీజేపీ నిబంధనల ప్రకారం కాంగ్రెస్ ఎంఎల్ఏగాను, కాంగ్రెస్ కు రాజీనామా చేస్తేనే చేర్చుకుంటున్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేస్తేనే బీజేపీ చేర్చుకున్నది. మరిపుడు డీకే ఏమిచేస్తారో చూడాలి. పార్టీకి ఇంతకుముందే రాజీనామా చేశారు కాబట్టి సమస్యలేదు. తాను బీజేపీ నేతనే అని ఆమె చెప్పుకుంటున్నారు. మరిపుడు కాంగ్రెస్ ఎంఎల్ఏ పదవిని ఏమిచేస్తారు ? బీజేపీ నిబంధన ప్రకారం డీకే ఇపుడు కాంగ్రెస్ ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయాల్సుంటుంది. మరి రాజీనామా చేస్తారా ? అన్నదే ఆసక్తిగా మారింది.
This post was last modified on September 5, 2023 10:36 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…