తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆధ్యాత్మిక భావాలు, భక్తి ఎక్కువ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు రజనీకాంత్ పాదాభివందనం చేయడం కూడా వివాదాస్పదమైంది. అయితే, ముఖ్యమంత్రిగా ఆయనకు పాదాభివందనం చేయలేదని, ఒక యోగిగా మాత్రమే ఆయనకు పాదాభివందనం చేశానని తలైవా క్లారిటీనిచ్చారు. ఏదేమైనా, రజినీకాంత్ బిజెపి మద్దతుదారుడు అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, బిజెపి తరఫున గవర్నర్ గా రజనీకాంత్ ను త్వరలోనే నియమించబోతున్నారంటూ చాలాకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇక, తలైవాకు గవర్నర్ పదవి ఇచ్చేందుకు మోడీ రెడీ అని, కానీ అమిత్ షా మాత్రం ఒప్పుకోవడం లేదని రకరకాల పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక, ఇటీవల ఝార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తో తలైవా సమావేశం కావడం, మాజీ సీఎం పన్నీర్ సెల్వాన్ని కలవడం నేపథ్యంలో ఈ పుకార్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఆ పుకార్లకు ఊతమిచ్చేలా ఉన్నాయి. రజనీకాంత్ కు గవర్నర్ పదవి దక్కడం దేవుడి చేతిలో ఉందంటూ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని సత్యనారాయణ తేల్చి చెప్పారు. కానీ, గవర్నర్ పదవిపై రజనీకాంత్కు ఆశ లేదని, అవి పుకార్లని మాత్రం అనలేదు. ఇక, పనీర్ సెల్వంతో రజనీ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని సత్యనారాయణ అన్నారు. అరోగ్యం రీత్యా, ఇతర కారణాల రీత్యా ప్రత్యక్ష రాజకీయాలపై రజనీ ఆసక్తి చూపని నేపథ్యంలో గౌరవప్రదంగా గవర్నర్ పదవి తీసుకుంటారేమో అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ పదవిపై ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సత్యనారాయణ ఖండించకపోవడం విశేషం.
This post was last modified on September 4, 2023 1:07 pm
తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం మాట తప్పిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే గతంలో…
అన్ని విషయాల్లోనూ కాకపోయినా.. కొన్ని కొన్నివిషయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ చూపే చొరవ ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఫిలిప్పీన్స్ రాజధాని…
కేరళ రాష్ట్రానికి చెందిన నటుడు, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న సురేష్ గోపి తన నోటికి పని చెప్పారు. బీజేపీ…
సీనియర్ హీరో గోపీచంద్ మొదట ‘తొలి వలపు’ సినిమాతో కథానాయకుడిగానే ప్రయాణం మొదలుపెట్టాడు కానీ.. అతడికి నటుడిగా మంచి పేరొచ్చింది…
సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. నటుడిగా ఫుల్ బిజీ అయిపోయాడు విజయ్ ఆంటోనీ. ‘బిచ్చగాడు’ చిత్రంతో అతను తెలుగులోనూ మంచి…
నవంబర్ నెల టెక్ ప్రపంచానికి ఊహించని షాక్‌లను ఇస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్నాలజీ సంస్థలు, బ్యాంకులు, విమానయాన సంస్థల డిజిటల్…