Political News

బీజేపీతో బంధం.. కేసీఆర్‌ను వెంటాడుతున్న గ‌తం

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర రావును ఊహించ‌ని రీతిలో ఆయ‌న‌ గతం వెంటాడుతోంద‌న్న చర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గులాబీ దళపతిని… అదే బీజేపీకి గతంలో అందించిన మద్దతు ఇప్పుడు ప్రత్యర్థులకు అవకాశంగా మారింది. ఇదంతా ప్ర‌స్తుతం వ్యూహాత్మ‌కంగా, ప‌కడ్బందీగా ప‌ని కానించేస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి.

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఒకే స‌మ‌యంలో ఎన్నికలు నిర్వ‌హించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ‌న్ నేష‌న్ వ‌న్ ఎల‌క్ష‌న్ పేరుతో వేగంగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విధానంలో ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ససేమీరా అంటుంది. అయితే, గతంలో ప్ర‌స్తుత బీఆర్ఎస్‌ పార్టీ, అప్ప‌టి టీఆర్ఎస్ పార్టీ ఈ త‌ర‌హా జ‌మిలీ ఎన్నికలకు పద్ధతి ఇచ్చిన విషయం తాజాగా పెరుగులోకి వచ్చి రచ్చ రచ్చగా మారింది అలా వెలుగులోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలను ఎప్పుడూ ఒక గంట కనిపెడుతూ ఉండే టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా ఏకకాలంలో ఎన్నికల విషయంలో ప్రధాని మోడీ వైఖరి, బీఆర్ఎస్ పార్టీ ప్రతిస్పందనల‌పై ఆచి తూసి ఆధారాల‌తో స‌హా స్పందించారు. స్వ‌యంగా కేసీఆర్ రాసిన లేఖ‌తో మీడియా ముందుకు వచ్చి అధికార పార్టీని ఇరుకున పెట్టారు. 2018లో జమిలి ఎన్నికలకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన లేఖను రేవంత్ రెడ్డి నేడు మీడియా ముందు విడుదల చేశారు.

ఏకకాలంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకి ఎన్నికల నిర్వహించడం తమకి పూర్తి సమ్మతం మాత్రమే కాకుండా ఈ ప్ర‌క్రియ‌కు మద్దతును కూడా ఇస్తున్నామని పేర్కొంటూ తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో టిఆర్ఎస్ పార్టీ రథసారథిగా గులాబీ దళపతి నాడు రాసి పంపించిన లేఖను మీడియా విడుదల చేసిన రేవంత్ రెడ్డి, ప్ర‌స్తుతం కేంద్రంలోని బీజేపీ నిర్ణ‌యంపై కేసీఆర్ చేస్తున్నది పైపై పోరాటమే తప్ప నిజాయితీతో కూడుకున్న స్పందన కాదని అనే సందర్భంగా తెలిపారు. బీజేపీకి బీఆర్ఎస్ టీం గా వ్యవహరిస్తుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికీ కేసీఆర్ నేరుగా తన వైఖరి ఏంటో తెలియజేయడం లేదని దేశంలోని అన్ని పార్టీలు స్పందించినప్పటికీ ఆయన మిన్న కుండిపోయారని రేవంత్ రెడ్డిని చెప్పారు.

స్థూలంగా తాను జాతీయ రాజకీయాలలో చక్కని తిప్పాలని, చిన్నాచితకా పార్టీలు వీలైతే ముఖ్య పార్టీలతో జతకట్టి ముందుకు సాగాలని అని అనుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని ఎండగట్టేలా రేవంత్ వ్యవహరించడం అందులోనూ ఆధారాలతో సహా బయట పెట్టడం గులాబీ పార్టీని, టీఆర్ఎస్ అధినేతని ఇబ్బందుల పాలు చేసే అంశం అని రాజకీయ వ‌ర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ లేఖ రాసిన తర్వాతే 2019లో టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, అప్పటినుంచి ఇప్పటివరకు బీజేపీ – టీఆర్ఎస్ ల మధ్య అంత సఖ్యత లేకపోవడం, పైగా ప్రస్తుతం జమిలి ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారనున్న నేపథ్యంలో ఐదేళ్ల కిందట చేసిన మద్దతును బీఆర్ఎస్ ఎలా సమర్థించుకుంటుంది లేదా వ్యతిరేకిస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం.

This post was last modified on September 3, 2023 8:19 pm

Share
Show comments
Published by
Satya
Tags: KCRModi

Recent Posts

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

22 minutes ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

1 hour ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

2 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

3 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

3 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

3 hours ago