Political News

జమిలిపై కేసీయార్ లో టెన్షన్ ?

నరేంద్రమోడీ  జమిలి ఎన్నికల ఆలోచన తెలంగాణాలో బీఆర్ఎస్ పై పడుతుందని కేసీయార్ లో టెన్షన్ మొదలైందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్ల మార్కును దాటాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్, బీజేపీకన్నా ముందుగానే అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సడెన్ గా కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణ విషయాన్ని ఆలోచిస్తోంది. ఈ ఆలోచనే గనుక ఆచరణలోకి వస్తే ముందు తమ పార్టీపైనే పడుతుందనే టెన్షన్ కేసీయార్లో పెరిగిపోతోందట.

ఎలాగంటే అసెంబ్లీ ఎన్నికలంటే కేవలం స్ధానిక అంశాల మీదే ఓటింగ్ జరుగుతుంది. పార్లమెంటు ఎన్నికలంటే జాతీయస్ధాయి అంశాలపైన ఓటింగ్ జరుగుతుంది. రెండు ఎన్నికలను కలిపి ఒకటిగా నిర్వహిస్తే అప్పుడు దేనిపై దేని ప్రభావం పడుతుందనే అంశంపై చర్చలు మొదలయ్యాయి. అయితే కేసీయార్ మాత్రం జమిలి ఎఫెక్టు బీఆర్ఎస్ విజయావకాలను దెబ్బ తీస్తుందనే అనుమానిస్తున్నారట. ఎలాగంటే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో 47 శాతం ఓటుషేరుతో 88 సీట్లను గెలుకుకున్నది.

అదే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటుషేర్ 41 మాత్రమే. అంటే కేవలం కొద్దినెలల వ్యవధిలో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీతో పోల్చుకుంటే పార్లమెంటుకు 6 శాతం ఓట్లు తగ్గిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాతం ఓటు షేరుతో కేవలం ఒకే ఒక్క నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. అదే పార్లమెంటు ఎన్నికల్లో 20 శాతం ఓటుషేరుతో నాలుగు లోక్ సభ సీట్లను గెలుచుకున్నది. కాంగ్రెస్ కూడా అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినపుడు పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నది.

ఆరుమాసాల వ్యవధిలో జరిగిన రెండు ఎన్నికల్లోనే ఓటింగ్ శాతంలో ఇంత తేడా ఉంటే ఇక రెండు కలిసే వస్తే పరిస్ధితి ఏమిటనే టెన్షన్ కేసీయార్లో పెరిగిపోతోందని సమాచారం. స్ధానిక అంశాలతో పాటు జాతీయ అంశాలను కూడా కేసీయార్ టచ్ చేయాల్సుంటంది. అప్పుడు ఓటర్లు ఎలా స్పందిస్తారో చెప్పటం కష్టం. పైగా జమిలి ఎన్నికల నిర్వహణ మొత్తం కేంద్రం పరిధిలోనే జరుగుతుంది. ఎన్నికల నిర్వహణలోని యంత్రాంగమంతా కేంద్రం చెప్పినట్లు వినాల్సిందే. అది బీఆర్ఎస్ కు మరో దెబ్బగా కేసీయార్ అనుమానిస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

This post was last modified on September 3, 2023 12:18 pm

Share
Show comments
Published by
Satya
Tags: KCRTelangana

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago