కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఇప్పటిదాకా ఉన్న గందరగోళం, అస్పష్టతకు తెరదించుతూ.. ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకొచ్చింది. ఒక దేశం.. ఒకే పరీక్ష అనే రీతిలో కేంద్రంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీల కోసం ‘కామన్ ఎంట్రన్స్ టెస్ట్’ నిర్వహించాలని నిర్ణయించింది.
ఇందుకోసం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) పేరుతో కొత్త సంస్థను కూడా ఏర్పాటు చేసింది. దీనికి యూపీఎస్సీ తరహాలో స్వయం ప్రతిపత్తి కూడా ఇస్తారు. దీనికి ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారిని నియమిస్తారు. దీని పరిధిలోకి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 20 నియామక సంస్థలను తీసుకొస్తారు. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒకటి చొప్పున మొత్తం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
ఈ కామన్ ఎంట్రన్స్ టెస్టు కింద ఏటా రెండుసార్లు నిర్వహించే పరీక్షల్లో సాధించే స్కోర్ మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. స్కోర్ పెంచుకోవడం కోసం అభ్యర్థులు మళ్లీ మళ్లీ పరీక్షలు రాయొచ్చు. దరఖాస్తు చేసే ఉద్యోగం ఏదైనా అత్యుత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలు 12 భాషల్లోనే జరుగుతుండగా.. ఈ టెస్టును మాత్రం రాజ్యాగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న భారతీయ భాషలన్నింట్లో నిర్వహిస్తారు. ఈ కొత్త విధానం వల్ల ఉద్యోగార్థులకు అనేక ప్రయోజనాలున్నాయి.
అన్ని పరీక్షలకు కలిపి ఒకేసారి నమోదు చేసుకోవచ్చు. వేర్వేరుగా ఫీజులు కూడా కట్టాల్సిన అవసరం లేదు. సిలబస్ కూడా ఒకటే ఉంటుంది. పరీక్ష ఫలితాలు త్వరగా వెల్లడిస్తారు. నియామక కాలం కూడా తగ్గుతుంది. ఆన్ లైన్లోనే ఈ పరీక్ష జరుగుతుంది. సొంత జిల్లాలోనే పరీక్ష రాసుకునే సౌలభ్యం కలుగుతుంది.
This post was last modified on August 20, 2020 4:07 pm
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…