ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు టీడీపీ ఎంపీలు వ్యవహార శైలి అంతుచిక్కని విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధినేతతో కలిసి తిరుగుతున్న ఆ ఎంపీలు.. ఆ నాయకుడి కొడుకును మాత్రం పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ ఎంపీలే కేశినేని నాని, గల్లా జయదేవ్. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక వంద రూపాయాల నాణెం విడుదల కార్యక్రమం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. కేశినేని నాని, గల్లా జయదేవ్తో పాటు మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు బాబుకు స్వాగతం పలకడం దగ్గర నుంచి పక్కనే ఉండి అన్నీ చూసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఉన్నప్పుడు మాత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు లోకేష్ ను మాత్రం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని పట్టించుకోలేదని టాక్. తమ లోక్సభ నియోజకవర్గాల్లో లోకేష్ యువగళం పాదయాత్ర సాగిన ఈ ఇద్దరు ఎంపీలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు లోకేష్ పాదయాత్ర సంగతే తెలియదన్నట్లు ఉండిపోయారు. దీంతో పార్టీ అధిష్ఠానం ఈ ఇద్దరిపై ఆగ్రహంతో ఉందనే వ్యాఖ్యలు వినిపించాయి.
కానీ ఇప్పుడు ఢిల్లీలో చూస్తేనేమో ఈ ఇద్దరితో బాబు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో లోకేష్ తో పాటు ఆయన వర్గం కూడా దీనిపై కాస్త అసహనంతో ఉన్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచినప్పటి నుంచి కేశినేని నాని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నా బాబు ఎలాంటి చర్య తీసుకోలేదని టాక్. మరోవైపు గల్లా జయదేవ్ సొంత వ్యాపారాలకే పరిమితమయ్యారనే అభిప్రాయాలున్నాయి. కానీ వీళ్లిద్దరి పట్ల బాబు ఏనాడూ కోపం ప్రదర్శించలేదని టాక్. మరోవైపు లోకేష్ వ్యవహార శైలి పట్ల నాని, గల్లా అంసత్రుప్తితో ఉన్నారనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.
This post was last modified on August 28, 2023 9:57 pm
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…