చికోటి ప్రవీణ్…పేరు తెలియని వారుండరు. మనిషిని నేరుగా చూడకపోవచ్చు, పరిచయం కూడా లేకపోవచ్చు. కానీ ప్రతిరోజు వార్తలను ఫాలో అయ్యేవాళ్ళకి చికోటి ప్రవీణ్ అనే పేరు చాలా పరిచయటమనే చెప్పాలి. చికోటి పేరు ఎలాగ పరిచయం ఉంటుందంటే గ్యాంబ్లింగ్ నిర్వాహకుడిగా. దేశ, విదేశాల్లో కాసినో నిర్వాహకుడిగా, గ్యాంబ్లింగ్ మాస్టర్ గా సమాజంలో చికోటి చాలా పాపులర్. అలాంటి చికోటి రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేయబోతున్నారట.
ఈ విషయాన్ని బీజేపీ ప్రకటించలేదు కానీ చికోటియే ప్రకటించేసుకున్నారు. తాను ఎక్కడనుండి పోటీచేసేది కూడా ప్రకటించేశారు. జహీరాబాద్ ఎంపీగా కానీ లేకపోతే ఎల్బీనగర్ ఎంఎల్ఏగా కానీ బీజేపీ తరపున పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. కామారెడ్డిలోని బిక్కనూరులో ఒక దేవాలయంలో పూజలు చేసిన సమయంలో చికోటి తన పోటీపై క్లారిటి ఇచ్చారు. చికోటికి బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
ఎందుకంటే అభ్యర్ధుల కొరతతో పార్టీ నానా అవస్తలు పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయటాని అన్నీచోట్లా గట్టి అభ్యర్ధులు లేరన్నవిషయం అందరకీ తెలుసు. అసెంబ్లీలకే గట్టి అభ్యర్ధులు దొరకకపోతే ఇక పార్లమెంటుకు ఎక్కడ దొరుకుతారు. ఈ పాయింట్ మీదే చికోటి లాంటి వాళ్ళ బీజేపీ టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈమధ్యనే చికోటి ఢిల్లీకి వెళ్ళి బండి సంజయ్, డీకే అరుణలతో భేటీ అయ్యారు. చికోటికి టికెట్ ఇస్తే అడ్వాంటేజ్ ఉంది.
అదేమిటంటే ఎన్నికల ఖర్చుల కింద చికోటికీ పార్టీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలేదు. బహుశా చికోటియే పార్టీకి ఎదురు డబ్బులు ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాగే ప్రచారంలో బీజేపీ నేతలకన్నా చికోటి మద్దతుదారులే ఎక్కువగా ఉంటారేమో. బీజేపీకి నేతలుంటారో లేదో తెలీదు కానీ చికోటికి ఊరూ వాడా ఫుల్లుగా మద్దతుదారులు, అభిమానులు ఉండచ్చు. బీజేపీ అభ్యర్ధులకు ప్రత్యేకంగా ప్రచారం అవసరం. కానీ చికోటికి అసలు ప్రచారమే అవసరంలేదు. అవసరమైతే తాను క్యాసినోలను నడిపిన నేపాల్, శ్రీలంక, రష్యా, థాయ్ ల్యాండ్ నుండి కూడా ప్రచారానికి వచ్చేస్తారేమో. మరి చికోటి విషయంలో బీజేపీ ఏమంటుందో చూడాలి.
This post was last modified on August 28, 2023 2:25 pm
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…