ఖమ్మంలో బీజేపీ తలబెట్టిన ‘రైతు గోస-బీజేపీ భరోసా’ సభకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖా మంత్రి హాజరైన సంగతి తెలిసిందే. ఈ సభలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా పాల్గొని బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోసం చేయడంలో కేసీఆర్ పీహెచ్ డీ చేశారని, కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్ అని బండి సంజయ్ సెటైర్లు వేశారు. గతంలో కేసీఆర్ కు ఎన్టీఆర్ టికెట్ ఇవ్వలేదని, దీంతో, అజయ్ రావు పేరును కేటీఆర్ గా మార్చాడని సంచలన ఆరోపణలు చేశారు. ఇక, కేసీఆర్ పెగ్గుల లెక్క ఇదీ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం రేపుతున్నాయి.
ఒక పెగ్ వేసిన కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అంటాడు, రెండు పెగ్గులు వేసి డబుల్ బెడ్రూం ఇళ్లు అంటాడు, మూడు పెగ్గులు వేసి.దళితులకు మూడెకరాలు అంటాడు, నాలుగు పెగ్గులు వేసి దళిత బంధు, ఐదు పెగ్గులు వేసి నేను ఏమీ అనలేదంటాడు అని కేసీఆర్ పై బండి సంజయ్ షాకింగ్ కామెంట్లు చేశారు. అలాంటి వ్యక్తి సీఎం అని, ఆయనను ఎలా భరిస్తున్నారని?కేసీఆర్ పేరు చెబితే ఉన్న గౌరవం కూడా పోతోందని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, రామరాజ్యం…మోదీ రాజ్యంతోనే ప్రజలకు బంగారు భవిష్యత్తు అని బండి సంజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
మరోవైపు, కేసీఆర్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీ అంటూ రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని , థూథూ మంత్రంగా రుణమాఫీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వడం లేదని ఆరోపించారు. వరి వేయొద్దని ప్రభుత్వమే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
బీఆర్ఎస్ ఓ కుటుంబ పార్టీ అని, బీఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లిస్ కు ఓటేసినట్టేనని విమర్శించారు. అమిత్ షా నేతృత్వంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నామని అన్నారు.
This post was last modified on August 27, 2023 11:16 pm
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…