Political News

అమలు చేసిన 99 శాతం హామీలేంటి? : చంద్రబాబు!

ఏపీ రాజకీయాలు రోజురోజుకి హీటెక్కుతున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ కూడా ఒక దాని మీద ఒక విమర్శలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన ఈ సమావేశంలో మాట్లాడుతూ..ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పై విరుచుకుపడ్డారు.

ఈ నేపథ్యంలోనే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్తగా నియమించిన పాలక మండలి పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. అసలు సభ్యుల నియామకం అనేది సరైన పద్ధతిలో జరగలేదని ఆయన దుయ్యబట్టారు. ”లిక్కర్‌ స్కాంలో నిందితుడిగా ఉండి..తరువాత అప్రూవర్‌ గా మారిన వ్యక్తి ఇప్పుడు మీకు మంచి వ్యక్తి అయ్యాడా? అలాంటి వ్యక్తిని ఎలా సభ్యునిగా నియామిస్తారని” ఆయన ప్రశ్నించారు.

జగన్‌ చేస్తున్న ఈ తప్పును ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలని కోరారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 99 శాతం హామీలు నెరవేర్చమని చెప్పుకుంటున్నారు. వారు నెరవేర్చిన 99 శాతం హామీలు ఏంటి అనేది ప్రజలకు వివరించాలన్నారు. అధికారంలోకి రావడంతోనే ఉచిత విద్యుత్‌ గురించి రైతులను ఇబ్బంది పెట్టారు. తరువాత కరెంట్‌ ఛార్జీలు పెంచి సామాన్యులను ఇబ్బంది పెట్టారు.

అన్నిటికంటే ముఖ్యమైనది ఇసుక దోపిడీ..ఇదివరకటి రోజుల్లో బకాసురులు ఉంటే..ఇప్పుడు జగన్‌ రాజ్యంలో ఇసుకాసురులు ఉన్నారు. ఇసుక దోపిడీ గురించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. అందరికీ అందుబాటులోకి రావాల్సిన పోలవరాన్ని గోదాట్లో ముంచేశారని విమర్శించారు.

మూడు రాజధానులంటూ ఆటలు ఆడారు. కనీసం ఏపీ ప్రజలకు రాజధాని ఏది అంటే ఇది అని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ఒక్క ఇండస్ట్రీ లేదు.. ఒక్కరికీ ఉద్యోగం లేదు. కానీ జగన్ అండ్ కంపెనీ అందర్నీ దోచుకుని.. తిరుగులేని విధంగా తయారైంది.” అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on August 27, 2023 10:48 am

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

48 minutes ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

1 hour ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

2 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

3 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

4 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

6 hours ago