రాజకీయాల్లో విజేతలకు, హుందాగా ఉండే వారి మాటలకే సమాజంలో గౌరవం ఉంటుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఓడిపోయినవారు, ఒకప్పటి రౌడీషీటర్లు, చిల్లర నేరగాళ్లు వార్నింగ్‌లు ఇస్తే వీధికుక్కలు కూడా భయపడవని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా లో ట్వీట్ చేశారు.
వివిధ జాతీయ సర్వేలలో వైసీపీ గెలుస్తుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. అయితే దీనిపై పచ్చమీడియా సొంత కథనాలు వండీవారుస్తోందని విజయసాయి నిప్పులు చెరిగారు.
ఏ జాతీయ సంస్థ సర్వే వచ్చినా అది ఫేక్, పెయిడ్ అంటూ పచ్చ మీడియా సొంత కథనాలు వండి వారుస్తోందని, మరి ఇండియా టుడే టీవీ సర్వే మాత్రమే అసలు సిసలు సర్వే అంటూ ఊదరగొడుతోందని పేర్కొన్నారు. పచ్చ పార్టీ గెలుస్తుందని చెబితేనే ఒరిజినల్, లేకపోతే ఫేకా? అని ఆయన ప్రశ్నించారు.
పరాజితులు, ఒకప్పటి రౌడీ షీటర్లు, చిల్లర నేరగాళ్లు హెచ్చరికలు చేస్తే వీధి కుక్కలు కూడా భయపడవని విమర్శలు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో గ్యారంటీగా గెలుస్తామనే ధీమా తెలుగుదేశం పార్టీలో ఒక్కడికీ లేదన్నారు.
This post was last modified on August 26, 2023 10:26 pm
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…