వైసీసీ ఎమ్మెల్యే కొడాలి నానిపై మాజీ మంత్రి కొల్లురవీంద్ర తీవ్ర విమర్శలు గుప్పించారు. కొడాని నాని రాజకీయ వ్యభిచారి, పిచ్చికుక్క అంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… లోకేశ్ పాదయాత్ర సక్సెక్ చూసి వైసీపీ నాయకుల్లో భయం పట్టుకుందన్నారు.
స్వార్ధం కోసం కొడాలి నాని ఏమైనా చేస్తారని.. చివరికి జగన్‌కు కూడా ద్రోహం చేస్తారన్నారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం చంద్రబాబు కృషి చేశారని తెలిపారు. ఓటమి భయం వైసీపీ నేతల మొహాల్లో స్వష్టంగా కనిపిస్తోందన్నారు. చెక్కలు మోసిన వాడు, టైర్ చక్రాలు మార్చుకొన్న వంశీ, కొడాలి మాట్లాడుతున్నారని.. తమరి చరిత్ర తెలుసుకోవాలని హితవుపలికారు.
కొడాలి, వంశీ బుక్కా పాకీర్లన్నారు. ‘‘సొంత బాబాయ్‌ను లేపాడు.. కొడాలి నాని, వంశీని లేపి టీడీపీ మీదకు తోస్తాడు.. జాగ్రత్తగా ఉండండి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. తమపై కేసులు పెడితే భయపడే పరిస్థితి లేదన్నారు.
బందరు పిచ్చోడు ఏదో వాగుతున్నారన్నారు. వైస్సార్సీపీ ఖాళీ అని… టీడీపీలోకి వలసలు వస్తున్నాయని తెలిపారు. పోసానికి లోకేశ్ మీద కాదు.. జగన్ మీదనే భయం ఉందని కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on August 25, 2023 9:36 pm
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…