చంద్రబాబు నారా లోకేష్ ని కనాలనుకోలేదు, కానీ చంద్రబాబుకి లోకేష్ పుట్టారు. అదొక బయలాజికల్ యాక్సిడెంట్ మినహా ఇంకేమీ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తన తండ్రి చిన్న ఉద్యోగి అని, తాను కష్టపడి సినీరంగంలోకి వచ్చి స్థిరపడ్డానని చెప్పుకొచ్చారు. తన విజయాలు, నారా లోకేష్ విజయాలు పక్క పక్కనపెట్టి చూస్తామన్నారు. థర్డ్ గ్రేడ్ డైరెక్టర్ అంటూ తనపై లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు వర్మ.
ఇటీవల రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమా షూటింగ్ ప్రకాశం బ్యారేజ్ పై జరిగింది. వర్మ సినిమాకు పర్మిషన్ ఇస్తారు కానీ, తన పాదయాత్రకు మాత్రం ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని నారా లోకేష్ ఓ ప్రెస్ మీట్ లో ప్రశ్నించారు. ఆ సమయంలోనే ఆయన ఓ థర్డ్ గ్రేడ్ సినిమాలు చేసే డైరెక్టర్ అంటూ సెటైర్లు పేల్చారు. ఆసెటైర్లకు వర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అసలు లోకేష్ పుట్టుక ఓ బయలాజికల్ యాక్సిడెంట్ అని అన్నారు.
నారా లోకేష్ తెలియని అభద్రతా భావంలో ఉన్నారని ఎద్దేవా చేశారు వర్మ. పవన్ సభలకు జనం వస్తున్నారని, తన సభలకు రాలేదనే భయంలో లోకేష్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. తన సినిమాతోపాటు రోజూ వివిధ ప్రాంతాల్లో వివిధ సినిమాల షూటింగ్ లు జరుగుతుంటాయని, సినిమా షూటింగ్ లకు, రాజకీయ సభలకు ఇచ్చే పర్మిషన్లను ఒకేగాటన ఎలా కడతారంటూ ప్రశ్నించారు వర్మ. షూటింగ్ పర్మిషన్ కు, మీటింగ్ పర్మిషన్ కు మధ్య సంబంధమేంటన్నారు.
ఓ వ్యూహం ప్రకారం రాజకీయ లబ్ధికోసం నారా లోకేష్ తనపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పులేదన్నారు వర్మ. ఆయన ఆ అజెండాతో కాకుండా.. అదే నిజమనే భ్రమలో మాట్లాడితే మాత్రం అర్జంట్ గా ఆయన సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లాలని సూచించారు. నిజంగానే లోకేష్ అమాయకుడా, లేక జనం అమాయకులు అనుకొని మాట్లాడతారా అని ప్రశ్నించారు వర్మ.
This post was last modified on August 25, 2023 6:56 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…