తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై కేసీఆర్ కన్నేశారు. విజయం సాధించే దిశగా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించేసి ప్రత్యర్థి పార్టీలను దెబ్బ కొట్టాలని చూశారు. అలాగే ఎన్నికలకు ముందు పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు, నేతల మధ్య దూరం ఉండకుండా కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు వివిధ వర్గాలను ఆకట్టకునే ప్రయత్నంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు.. ఇలా అందరికీ వరాలు ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నర్తో దూరాన్ని కూడా తగ్గించే ప్రయత్నాలను కేసీఆర్ మొదలెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ గవర్నర్గా తమిళి సై వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఆమెను దూరం పెడుతున్నారనే టాక్ ఉంది. గవర్నర్ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు కూడా. మరోవైపు బిల్లుల పెండింగ్ కారణంగా కేసీఆర్ వర్సెస్ గవర్నర్ అనేలా పరిస్థితి మారిందనే చెప్పాలి. రాజ్ భవన్లో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా ఇన్ని రోజులు కేసీఆర్ వెళ్లలేదు. మరోవైపు కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని ఇప్పటివరకూ గవర్నర్ సందర్శించలేదు.
కానీ ఎన్నికలకు ముందు గవర్నర్తో గొడవ ఎందుకని కేసీఆర్ తగ్గారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోసం రాజ్ భవన్కు కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్తో కేసీఆర్ భేటీ అయ్యారు. అంతే కాకుండా సచివాలయం ప్రాంగణంలో నిర్మించిన ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవానికి రావాలని గవర్నర్ను కేసీఆర్ ఆహ్వానించగా.. అందుకు ఆమె ఒప్పుకున్నారు. ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవానికి కేసీఆర్తో కలిసి హాజరయ్యారు. అంతే కాకుండా ఆ తర్వాత సచివాలయాన్ని కూడా గవర్నర్ పరిశీలించారు.
This post was last modified on August 25, 2023 2:37 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…