Political News

శ్రీదేవిని పక్కనపెట్టాల్సిందే.. టీడీపీ నేతల నుంచే డిమాండ్

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి రాజకీయ భవిష్యత్ అయోమయంలో పడనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మేలు జరిగేలా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే కారణంతో శ్రీదేవిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించిన శ్రీదేవి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో ఆమె చర్చించారు. అంతే కాకుండా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా అమరావతిలో శ్రీదేవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారనే టాక్ ఉంది.

కానీ వైసీపీ నుంచి వచ్చిన శ్రీదేవికి బాబు, లోకేష్ ప్రాధాన్యత ఇవ్వడం టీడీపీ నాయకులకు రుచించడం లేదని తెలిసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల ఎంపీగా శ్రీదేవిని పోటీ చేయించాలని బాబు చూస్తున్నట్లు టాక్. కానీ ఆ సీటు ఆశిస్తున్న పనబాక లక్ష్మీ తదితరులు అధిష్ఠానం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఓడిపోయే అవకాశం ఉన్న తిరుపతి లోక్ సభ స్థానాన్ని తనకిస్తూ.. రాజకీయ స్వార్థం చూసుకుంటున్న శ్రీదేవిని బాపట్లలో నిలబెట్టాలనుకోవడం సరికాదని పనబాక లక్ష్మీ కోపంతో ఊగిపోతున్నారని టాక్.

అమరావతి నుంచి రాజధాని తరలించాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన శ్రీదేవి.. ఇప్పుడు సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ పక్షాన చేరారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఆమెకు టికెట్ ఇస్తే పార్టీ కోసం పని చేసే అవకాశమే లేదని చెబుతున్నట్లు కూడా తెలిసింది. ఏది ఏమైనా శ్రీదేవిని పక్కన పెట్టాల్సిందేనన్న టీడీపీ నేతల డిమాండ్లు ఎక్కువవుతున్నాయని సమాచారం.

This post was last modified on August 25, 2023 2:42 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

1 hour ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

3 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

6 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

6 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

7 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

8 hours ago