రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కాకపోతే ఒంటరి పోటీ అన్నది ఏపీలో కాదు తెలంగాణ లో మాత్రమే. తెలంగాణలో షెడ్యూల్ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగాల్సుంది. ఇందుకు అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో చాలా బిజీగా ఉంటున్నాయి. 119 నియోజకవర్గాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత 115 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేసిన విషయం తెలిసిందే. ఇదే పద్దతిలో టీడీపీ కూడా అభ్యర్ధులను ఫైనల్ చేయబోతోందంటు ప్రచారం మొదలైపోయింది.
మొదటి జాబితాగా 30 మంది అభ్యర్థుల పేర్లు కూడా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందనే విషయాన్ని చంద్రబాబు నాయుడు లేదా తెలంగాణా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజే చెప్పాలి. సరే జాబితాలోని పేర్లు, నియోజకవర్గాల మాట ఎలా ఉన్నా ఒంటరి పోటీ అయితే దాదాపు ఖాయమన్నట్లే. ఇప్పటికే కాసాని మీడియాతో మాట్లాడినపుడల్లా టీడీపీ ఒంటరి పోటీకి రెడీ అవుతున్నట్లు చాలాసార్లు ప్రకటించారు.
ఇందులో భాగంగానే ఖమ్మం, నిజామాబాద్, కుకట్ పల్లి, నిజాంపేట, ఎల్బీనగర్ లాంటి అనేక ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే విషయమై ఒకటికి రెండుసార్లు సర్వేలు కూడా చేయిస్తున్నారు. ఇదే సమయంలో గట్టి అభ్యర్థులను కూడా రెడీ చేస్తున్నారు. ఒక లెక్క ప్రకారం చూస్తే ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీకి సాలిడ్ గా సగటున 5 వేల ఓట్లుంటాయి. ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ఇంకా ఎక్కువ ఓట్లే ఉంటాయి.
నిజానికి ఉన్న ఓట్లతో టీడీపీ ఎక్కడా గెలవదని అందరికీ తెలుసు. అయితే టీడీపీ గెలవకపోయినా ప్రత్యర్ధుల్లో ఎవరో ఒకళ్ళ ఓటమికి మాత్రం కారణమవుతుంది. ఈ విషయంలోనే మిగిలిన పార్టీలు టీడీపీ ఓటుబ్యాంకుపై కన్నేశాయి. అలాగని టీడీపీతో పొత్తుకు ఏ పార్టీ కూడా ముందుకు రావటంలేదు. ఒకపుడు బీజేపీతో టీడీపీకి పొత్తుంటుందనే ప్రచారం జరిగినా తర్వాత ఎందుకో అది ముందుకు వెళ్ళలేదు. దాంతో ఇపుడా విషయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ నేపధ్యంలోనే టీడీపీ ఒంటరిపోటీకి రెడీ అయిపోతోందనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోతోంది. మరి చంద్రబాబు ఏమి చెబుతారో చూడాలి.
This post was last modified on August 25, 2023 1:42 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…