ఓ వైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.. మరోవైపు మెడపై అనర్హత కేసులున్నాయి.. మరి ప్రచారం ఎలా?.. ఇది ఇప్పుడు బీఆర్ఎస్లోని కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు ప్రచారానికి తెరలేపుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వేడి రాజేసిన సంగతి తెలిసిందే. కానీ కోర్టు కేసుల కారణంగా ప్రచారంలో ఇబ్బందులు తప్పవేమోనని కొంతమంది ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నారని తెలిసింది.
ఇప్పటికే కొత్తగూడెం సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ.. అక్కడ జలగం వెంగల్రావే ఎమ్మెల్యే అంటూ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న వనమాకు కేసీఆర్ మరోసారి టికెట్ కేటాయించారు. ఇక గత ఎన్నికల వేళ అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసులో మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసు నమోదవడంతో పాటు ఆయన కోర్టు విచారణ ఎదుర్కుంటున్నారు. కానీ మరోసారి అతనికే మహబూబ్ నగర్ టికెట్ దక్కింది. తాజాగా గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని హైకోర్టు పేర్కొంది. కానీ ఇప్పటికే కేసీఆర్ ఆయనకు మరోసారి టికెట్ ఇచ్చారు.
మరోవైపు పౌరసత్వం వివాదం కారణంగా వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు టికెట్ దక్కలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మర్రి జనార్ధన్, గూడెం మహిపాల్ రెడ్డిపై ఎన్నికల పిటిషన్లు కోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి ప్రచారంలో వెళ్తే ఈ కేసులను ఆయుధంగా చేసుకుని ప్రత్యర్థి పార్టీలు రెచ్చిపోయే అవకాశముంది. కేసులు ఉన్న నాయకులకు ఎలా ఓట్లు వేస్తారంటూ ప్రశ్నించే ఆస్కారముంది. అందుకే ముందుగానే ప్రత్యర్థి వ్యూహాలను దీటుగా ఎదుర్కొనేందుకు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారని తెలిసింది.
This post was last modified on August 25, 2023 1:46 pm
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప…
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…