Political News

పవన్‌ వచ్చే వరకు అంతేనా?

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏపీలో పర్యటించిన సందర్భం మినహా.. మిగిలిన సమయంలో ఆ పార్టీ స్తబ్దు ఉటుందనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత వచ్చినపుడేనా.. మిగిలిన సందర్భాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లే కార్యక్రమాల రూపకల్పన ఏది అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రెండు నెలల నుంచి వారాహి యాత్ర పేరుతో పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలో విస్త`తంగా పర్యటించారు. మూడు విడతల ఆయన యాత్రలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో వైజాగ్‌ను కవర్‌ చేశారు. ఆ సమయంలో పతాక స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలతో పత్రికలు నిండిపోయాయి. అదే విధంగా న్యూస్‌ చానళ్లలోనూ ప్రైమ్‌ టైంలో చర్చలు జరిగాయి. అయితే వారాహి వాహనంపై కూడా పవన్‌ వన్‌మ్యాన్‌ షోలా వ్వహరించారని విమర్శలు కూడా వచ్చాయి. యాత్రలో భాగంగా చేపట్టిన జనవాణి కార్యక్రమంలో మాత్రమే కొందరు ఇతర పార్టీ నాయకులు కనిపించారు. ఏదేమైనా వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిందనే రాజకీయ విశ్లేషకులు భావించారు.

వైజాగ్‌ పర్యటనతో వారాహి మూడో విడత యాత్ర ముగిసింది. ఆ తర్వాత ఆయన షూటింగ్‌లకు వెళ్లాడని సమాచారం. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి నవంబరు నెల నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానున్నట్లు తెలిసింది. అయితే.. అప్పటి వరకు క్యాడర్‌ స్తబ్దుగా ఉండకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులపై ఉంది. మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతి నిమిషం కీలకం అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అన్నిచోట్ల వారాహి యాత్రను విజయవంతం చేస్తున్న జనసైనికులు, వీర మహిళలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఈ సమయాన్ని ఎలా వినియోగిస్తారో వేచి చూడాలి..?

This post was last modified on August 24, 2023 3:56 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago