నారా లోకేష్ గన్నవరం వేదికగా వైసీపీ నేతలు కొడాలి నాని, వంశీల మీద విరుచుకుపడ్డారు. ఈ విషయం గురించి వైసీపీనేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ చేసిన అనుచిత వ్యాఖ్యల పై ఆయన మండిపడ్డారు. దమ్ముంటే లోకేష్ గుడివాడలో కొడాలి నాని మీద పోటీ చేసి గెలిచి చూపించాలన్నారు.
చంద్రబాబుకి తన కొడుకుని పెంచడం చేత కాలేదని విమర్శించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే చెప్పుకునే పెద్ద మనిషి కొడుకు సంస్కారహీనంగా పెరిగాడని పేర్కొన్నారు. లోకేష్ నిర్వహిస్తున్న యాత్ర పేరు యువ గళం కాదు..యువగంగాళం అని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు పేర్లు మార్చి టీడీపీ వాళ్లు చెబుతున్నారని అన్నారు.
జగన్ ప్రజలకు ఏమి చేస్తాను అనేది ఎన్నికల సమయంలో వివరించారు.అదే అధికారంలోకి రాగానే చేస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు గన్నవరం ఎమ్మెల్యే వంశీని పశువుల డాక్టర్ అంటున్నారు. ఆయన మీ దగ్గర నుంచి మా దగ్గరకు వచ్చారు. మరి ఆ సమయంలో ఆయనేమన్నా మనుషుల డాక్టర్..దేవతలా డాక్టర్ గా ఉన్నారా అని ప్రశ్నించారు.
కొడాలి నాని కూడా టీడీపీలో ఉన్న సమయంలో ఏమైనా ఇన్ఫోసిస్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారా అని ప్రశ్నిచారు, ఆయన ఒక మంత్రిగా చేశారు.ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు.అలాంటి వ్యక్తిని పట్టుకుని లారీ క్లీనర్..కప్పులు కడిగేవాడు అని పేర్కొనడం ఏమి బాగాలేదు అని ఆయన అన్నారు.
తండ్రీ కొడుకులకు ఆవగింజంత సిగ్గు, దోస గింజంత ఆత్మాభిమానం ఉంటే గుడివాడలో మీ అభ్యర్ధి ఎవరో చెప్పాలని పేర్ని నిలదీశారు. బట్టలూడదీసి చూసే అలవాటు ఏమిటన్నారు.
This post was last modified on August 23, 2023 5:32 pm
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…