టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , టీడీపీ నేత నారా లోకేష్ పై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోల్లో రాళ్లు వేసిన వారేవరో తేల్చేందుకు తమ సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. వైసీపీ వాళ్లే కనుక రాళ్లు వేసినట్లు రుజువు అయితే కనుక ఈ క్షణాన రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. టీడీపీ వారి దగ్గర సరుకు అయిపోయింది కాబట్టే ఇలాంటి పిచ్చి రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. నారా లోకేష్ హింసను ప్రోత్సహిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని యాత్రలు చేసినా కూడా వచ్చే నష్టం ఏమి లేదని ఆయన తేల్చి చెప్పారు. వచ్చేఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని తరిమికొడతారో..మిమ్మల్ని తరిమి కొడతారో చూద్దామన్నారు. టెక్నాలజీ మొత్తం నాకే తెలుసు అని కబుర్లు చెప్పే చంద్రబాబు నాయుడు మరి దొంగ ఓట్లను గుర్తించడంలో కూడా టెక్నాలజీ సాయపడుతుందని తెలియదా అని ప్రశ్నించారు.
సెల్‌ఫోన్ కనిపెట్టాను అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబుకి టెక్నాలజీ ఉపయోగించి దొంగ ఓట్లను గుర్తించమన్నారు.ఉరవ కొండలో దొంగ ఓట్ల నమోదు జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయం లో చంద్రబాబు ఎన్ని రాజకీయాలు చేసినా సరే మేము ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆధార్, మోభైల్ నెంబర్ తో ఓటు సీడింగ్ జరుగుతోందన్నారు. ఎక్కడ కూడా అక్రమంగా ఓట్ల తొలగింపు అనేది లేదని స్పష్టం చేశారు.
This post was last modified on August 23, 2023 5:12 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…