Political News

ఒకటే సీటు.. మైనంపల్లి దారెటు?

మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పరిస్థితి ముందు గొయ్యి వెనుకు నుయ్యి లాగే మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి హరీష్ రావుపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేసి మైనంపల్లి ఇబ్బందులు కొని తెచ్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మింగలేక కక్కలేక ఏం చేస్తారన్నది చూడాలన్న టాక్ ఉంది. మరోసారి మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు మైనంపల్లి హన్మంతరావుకు కేసీఆర్ అవకాశం కల్పించారు. కానీ మైనంపల్లి తనయుడు రోహిత్ మెదక్ సీటు ఆశించగా నిరాశే మిగిలింది. దీంతో ఇప్పుడు మైనంపల్లి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి తాను, మెదక్ నుంచి తనయుడు రోహిత్ పోటీ చేస్తామని మైనంపల్లి ప్రకటించడం గమనార్హం. పార్టీ రోహిత్ కు టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగానైనా పోటీ చేయిస్తానని మరీ మైనంపల్లి చెప్పారు. అంతే కాకుండా మెదక్లో హరీష్ రావు పెత్తనం ఏమిటంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ను బట్టలు ఊడదీస్తా, సిద్ధిపేట్లో అడ్రస్ లేకుండా చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని తర్వాతే కేసీఆర్ జాబితా ప్రకటించారు. ఇందులో మైనంపల్లికి చోటు దక్కింది. కానీ మెదక్ నుంచి రోహిత్కు కాకుండా హరీష్ రావు సూచించిన పద్మా దేవేందర్రెడ్డికి కేసీఆర్ అవకాశం ఇచ్చారని టాక్.

మరి ఇప్పుడు మైనంపల్లి ఏం చేస్తారు? మరోవైపు హరీష్ వెంటే తామున్నామని, మైనంపల్లి వ్యాఖ్యలు సరికాదని కేటీఆర్ చెప్పారు. దీంతో పార్టీలోని నాయకులంతా హరీష్ వెంటే ఉన్నట్లే. మరి తప్పయిందని ఒప్పుకుని మల్కాజిగిరిలో పోటీ చేస్తారా? అన్నది చూడాలి. లేదంటే పార్టీకి రాజీనామా చేసి.. తండ్రికొడుకులు స్వతంత్రులుగా పోటీ చేస్తారా? అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అలా కానీ జరిగితే ఇద్దరూ ఓడిపోవడం ఖాయమేనని టాక్. లేదంటే తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ.. మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా రోహిత్ను నిలబెడతారా? అంటే ఆ అవకాశమూ లేదు. అందుకే మైనంపల్లి సైలెంట్గా ఉంటూ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on August 23, 2023 6:35 am

Share

Recent Posts

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

12 minutes ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

5 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

12 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

13 hours ago