Political News

నా జీవితం అంతా జగన్ వెంటే: పోసాని

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు నారా లోకేష్‌ పై వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను చంపేందుకు లోకేష్‌ కుట్ర పన్నారు. కోర్టుకు హాజరయ్యే క్రమంలో తనను చంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. లోకేష్ తనపై రూ.4 కోట్లు పరువు నష్టం దావా వేశారని ఫైర్ అయ్యారు.

లోకేష్‌పై పరువు నష్టం దావా వేస్తే కనీసం 20 ఏళ్లు జైల్లో ఉంటారని పోసాని హెచ్చరించారు. సీఎంపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన లోకేష్‌పై పరువు నష్టం దావా వేయకూడదా అని పోసాని ప్రశ్నించారు. లోకేశ్ ఎవరిపై విమర్శలు చేయలేదా అని పోసాని ప్రశ్నించారు. .

నాపై పాత కేసులు పెట్టి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కృష్ణమురళీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ అంటే చంద్రబాబు గుర్తుకొస్తారని.. మరి హెరిటేజ్ ఆస్తులు లోకేశ్‌కు చెందవా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమాలు బయటపెట్టడంతో తనపై కక్షకట్టారని.. పుంగనూరులో పోలీసులపై కూడా హత్యాప్రయత్నం చేశారని పోసాని ఆరోపించారు.

ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్ధుడు చంద్రబాబన్నారు. చంద్రబాబుపై ఎన్ని కేసులు ఉన్నా జైలుకు వెళ్లలేదని.. కొంతమందికి కులం పిచ్చి ఎక్కించి తనను తిట్టిస్తున్నారని పోసాని ఫైర్ అయ్యారు. కులాభిమానం ఉండొచ్చు కానీ.. దురాభిమానం వుండకూడదన్నారు. గెలిచింది ఎవరైనా ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా అనేది చూడాలని పోసాని కృష్ణమురళీ అన్నారు.

రైతుల కష్టాలను తీర్చడానికి వైఎస్సార్ రూ.11 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశారని ప్రశంసించారు. అమరావతిలో 5 శాతం భూములు పేదలకు ఇవ్వాలని చట్టంలో వుందని.. ఆ చట్టాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారని పోసాని ఆరోపించారు. కులాలకు అతీతంగా వైఎస్సార్ రుణమాఫీ చేశారని.. అప్పుడు తమకు ఈ రుణమాఫీ వద్దని ఈ రైతులు చెప్పారా అని పోసాని ప్రశ్నించారు.

పెదకాకానిలో తనకు కొన్ని ఇళ్ల స్థలాలు మాత్రమే వున్నాయని.. తన కష్టార్జితంతోనే ఆ భూములు కొన్నానని ఆయన తెలిపారు. అవసరమైతే నా భూములన్నీ పేదలకు ఉచితంగా ఇచ్చేస్తానని.. పేదల భూములపై వేసిన కేసులు వెనక్కి తీసుకోవాలని పోసాని సవాల్ విసిరారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని.. తన జీవితాంతం వైఎస్ జగన్ వెంటే వుంటానని కృష్ణమురళీ అన్నారు.

This post was last modified on August 22, 2023 7:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జైలు వరకు వెళ్లిన కస్తూరి కేసు

తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…

1 hour ago

పుష్ప 3 లో యాక్ట్ చేస్తావా? : తిలక్ ఏమన్నాడంటే…

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…

5 hours ago

‘దళపతి విజయ్’ : సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా..

కోలీవుడ్‌లో చిన్న వ‌య‌సులోనే మంచి పేరు సంపాదించుకున్న ద‌ళ‌ప‌తి విజ‌య్‌. విజ‌య్ సినిమాలు.. క్రిటిక్స్‌, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచ‌నాలు…

5 hours ago

అవినాష్‌రెడ్డికి మ‌రో చిక్కు.. ఇక‌, బీటెక్ రెడ్డి వంతు!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్ప‌టికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒక‌వైపు బాబాయి వివేకానంద‌రెడ్డి దారుణ…

8 hours ago