రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులకు ఎంతో ముఖ్యమైన రోజు ఆగస్టు 22. సంక్రాంతి తరువాత మెగా అభిమానులకు అంత పెద్ద పండగ ఏదైనా ఉంది అంటే..అది మెగాస్టార్ పుట్టిన రోజే. ఈ వేడుకను అభిమానులు ఎంతో ఘనంగా వేడుకగా జరుపుకుంటారు. ఇందులో భాగంగానే గుడివాడలో కూడా చిరు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వచ్చారు. అయితే గతంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ సందర్భంలో నాని ఏకంగా పకోడిగాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. అలాంటి కొడాలి నాని చిరు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.నేను ఏమి మాట్లాడినా టీడీపీ, జనసేన వారికి బూతులా వినిపిస్తుందని నాని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ కా మారింది.
చిరు పుట్టిన రోజు వేడుకల్లో కొడాలి నాని కేక్ కట్ చేసి చిరంజీవి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలంటూ ఛాలెంజ్ విసిరారు. “నేను శ్రీరామ అన్నా టీడీపీ, జనసేనలకు బూతు మాటలుగా వినపడతాయి. నేనేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసు….. మేమంతా క్లారిటీ గానే ఉన్నాం” అని స్పష్టం చేశారు. రాజకీయంగా చిరంజీవి విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసన్నారు.
జగన్ గురించి, తమ గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతానని.. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదని తెలిపారు. చిరంజీవి అభిమానుల ముసుగులో, టీడీపీ, జనసేన శ్రేణులు గుడివాడ రోడ్లు మీద దొల్లారని మండిపడ్డారు.
చిరంజీవికి, తమకు మధ్య అగాధం సృష్టించాలని టీడీపీ, జనసేన కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రజారాజ్యం తరపున తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లిన చిరంజీవికి చేతులెత్తి నమస్కారం పెట్టానని తెలిపారు. ఆయనను అనేక సందర్భాల్లో కలిశానని.. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామని అన్నారు. తమకు ఇచ్చినట్లే…. డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే చెప్పినట్లు వివరించారు. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ రాదా…. ఆయన గురించి మాట్లాడినట్లు ఎట్లా అవుతుందని’’ ప్రశ్నించారు. తన వెంట ఉన్న వ్యక్తులు 60 శాతం చిరంజీవి అభిమానులే అని కొడాలి నాని వెల్లడించారు.
This post was last modified on August 22, 2023 2:59 pm
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…