హరీష్ రావు… కేసీఆర్ మేనల్లుడు, బీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో కీలక నేత. పార్టీలో చాలా మంది నేతలకు హరీష్ ఎంత చెప్తే అంతా. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మెదక్ లో హరీష్ రావు పెత్తనం సహించని మైనంపల్లి తీవ్ర విమర్శలు చేశారని తెలుస్తోంది.
వచ్చే తెలంగాణ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి, మెదక్ నుంచి ఆయన కొడుకు రోహిత్ పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ మెదక్లో హరీష్ రావు జోక్యం చేసుకుంటున్నారని సమాచారం. పద్మా దేవేందర్ గౌడ్కు టికెట్ ఇప్పించేందుకు హరీష్ ప్రయత్నిస్తున్నారని తెలిసింది. దీంతో హరీష్ పై మైనంపల్లి సీరియస్ అయ్యారని టాక్. మెదక్లో ప్రచారం చేయడానికి హరీష్ ఎవరంటూ మైనంపల్లి ప్రశ్నిస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసిన మెదక్ నుంచి రోహిత్ను గెలిపించుకుంటానని కుండబద్ధలు కొడుతున్నారు.
హరీష్ను ఆయన నియోజకవర్గంలోనే ఓడించేందుకు కూడా తాను వెనకాడబోమని మైనంపల్లి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హరీష్ బట్టలు ఊడదీసేంత వరకూ నిద్రపోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎంతో మందిని హరీష్ అణిచివేశారని, అక్రమంగా రూ.లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు. సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనకు, కొడుక్కి టికెట్లు రాకపోతే మార్టీ మారాలనే ఆలోచనలోనూ మైనంపల్లి ఉన్నట్లు తెలిసింది.
This post was last modified on August 21, 2023 4:32 pm
సినిమాలకు సంబంధించి క్రేజీ సీజన్లకు చాలా ముందుగానే బెర్తులు బుక్ చేసేస్తుంటారు. తెలుగులో ఏడాది ఆరంభంలో సంక్రాంతి సీజన్కు బాగా…
ఏపీలోని కూటమి ప్రభుత్వంలోనే కాదు.. పార్టీల్లోనూ ప్రక్షాళన జరగనుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీల పరంగా పైస్థాయిలో నాయకులు…
రాజకీయ రంగ ప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా చెప్పుకున్న జన నాయకుడు జనవరి 9 విడుదల కానుంది. మలేసియాలో…
సోమవారం వచ్చేసింది. ఎంత పెద్ద సినిమా అయినా వీక్ డేస్ మొదలుకాగానే థియేటర్ ఆక్యుపెన్సీలో తగ్గుదల ఉంటుంది. కాకపోతే అది…
మన శంకరవరప్రసాద్ గారులో వెంకటేష్ క్యామియో గురించి ఎన్ని అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. పేరుకి గెస్టు రోల్ అంటున్నా ఇరవై…
మూడున్నర గంటలకు పైగా నిడివి అంటే ప్రేక్షకులు భరించగలరా? రణ్వీర్ సింగ్ మీద ఒక సినిమా అనుభవమున్న దర్శకుడు స్వీయ…