ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్లే ముందు ఏ నాయకుడైనా సరే పార్టీ మారడం లేదని చెప్పడం ఆనవాయితీగానే వస్తుందనే అభిప్రాయాలున్నాయి. చివరకు సొంత పార్టీలోని కీలక నాయకులపై నెపం వేసి, నింద మోపి.. అదే సాకుతో ఇతర పార్టీ కండువా కప్పుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా అదే బాటలో సాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరతారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. కానీ తాజాగా విలేకర్ల సమావేశం పెట్టిన ఆయన అలాంటిదేమీ లేదని చెప్పడం గమనార్హం.
తాను పార్టీ మారుతున్నానని ఎవరు చెప్పారని మీడియాపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. లేని పోని ప్రచారం వెనుక కాంగ్రెస్ పార్టీలోని సొంత నేతలే ఉన్నారనే ఉద్దేశం వచ్చేలా జగ్గారెడ్డి మాట్లాడారని ఆయన మాటలను బట్టి తెలుస్తోందని టాక్. సామాజిక మాధ్యమాల్లోనూ, మీడియాలో కావాలనే పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రచారం చేయడానికి డబ్బులు ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు. దీని వెనుక తెలుగు దేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నాయకులే ఉన్నారని పేరు చెప్పకుండా పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జగ్గారెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది.
జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరడం ఖాయమని, ఇప్పటికే కేసీఆర్తో చర్చలు పూర్తయ్యాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ ఇది అబద్ధమైతే సంగారెడ్డిలోని బీఆర్ఎస్ నేతలు జగ్గారెడ్డి రాకను వ్యతిరేకిస్తూ ఎందుకు ఆందోళన చేస్తారన్నది ఇక్కడ ప్రశ్న. జగ్గారెడ్డి పార్టీలో చేరడం ఖాయమైంది కాబట్టే.. సంగారెడ్డి నుంచి టికెట్ ఆశిస్తున్న చింతా ప్రభాకర్ వర్గం నిరసన వ్యక్తం చేస్తోందని టాక్. పైగా హరీష్ రావును కలిసిన సంగారెడ్డి బీఆర్ఎస్ నేతలు జగ్గారెడ్డిని చేర్చుకోవద్దని కోరడం గమనార్హం. మరి ఈ పరిణామాలు చూస్తుంటే జగ్గారెడ్డి పార్టీ మారడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా పార్టీ మారితే స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారనే వ్యతిరేకత వస్తుందని, ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులే తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్తే ఎలాంటి సమస్య ఉండదని జగ్గారెడ్డి భావిస్తున్నట్లు టాక్.
This post was last modified on August 20, 2023 4:56 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…