ఖమ్మం జిల్లా వైరా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు శరాఘాతమనే చెప్పాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఎమ్మెల్యే రాములు నాయక్కు టికెట్ దక్కదనే విషయం ఖాయమైందని సమాచారం. వైరా నియోజకవర్గంలో రాములు నాయక్పై సొంత పార్టీ నేతల నుంచి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిసింది. దీంతో ఈ సారి అక్కడ నుంచి రాములు నాయక్కు బదులు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్కు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని తెలిసింది.
వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదనే విషయం తెలుసుకున్న రాములు నాయక్.. కేసీఆర్ ను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ను కలిసేందుకు తన కుమారుడు జీవన్ లాల్తో కలిసి రాములు నాయక్ మూడు రోజులుగా హైదారబాద్లోనే మకాం వేశారు. కానీ రాములు నాయక్కు కలిసేందుకు ఇష్టపడని కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది. టికెట్ కోసం చివరి ప్రయత్నంగా కేసీఆర్ను కలిసేందుకు రాములు నాయక్ గట్టిగానే ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని టాక్.
కేసీఆర్ కలిసేందుకు ఇష్టపడకపోవడంతో రాములు నాయక్ నిరాశలో మునిగి పోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు మంత్రి కేటీఆర్ను కలిసినా టికెట్పై రాములు నాయక్కు హామీ దక్కలేదని తెలిసింది. సర్వేలు రాములుకు వ్యతిరేకంగా ఉన్నాయని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. తనకు కాకపోయినా కుమారుడికైనా టికెట్ ఇవ్వాలని కోరినా ఫలితం లేదని తెలిసింది. పట్టు వీడని రాములు నాయక్ మంత్రి హరీష్ రావును కలిసినా టికెట్పై హామీ దొరకలేదని సమాచారం.
This post was last modified on August 20, 2023 4:53 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…