స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రగులుతున్నట్లే కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతల మధ్యే రాజకీయ పోరు ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఎమ్మెల్యే రాజయ్య వర్సెస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పోరు ముదురుతుందనే చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య తనకే మరోసారి టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు. మరోవైపు ఈ సారి పోటీ చేసే అవకాశం వస్తే గెలిపించాలంటూ ప్రజలను కడియం కోరుతున్నారు.
తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఆయన ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. త్వరలోనే తొలి జాబితాను విడుదల చేయబోతున్నారని సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు కూడా టాక్. అలా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే నియోజకవర్గాల్లో స్టేషన్ ఘన్పూర్ కూడా ఉంటుందని తాజాగా కడియం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనకు పోటీ చేసే అవకాశం వస్తే గెలిపించాలని ఇప్పటికే కడియం ప్రచారం మొదలెట్టినట్టు కనిపిస్తున్నారు.
సర్పంచ్ వివాదం రాజయ్యపై ప్రతికూల ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదీ కాకుండా కొంత కాలం నుంచి కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ రాజయ్య విమర్శలు చేస్తున్నారు. అందుకే వివాదాల్లో చిక్కుకుంటున్న రాజయ్యను కాదని ఈ సారి టికెట్ కడియం శ్రీహరికి ఇవ్వాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు టాక్. అదే జరిగితే మరి రాజయ్య పరిస్థితి ఏమిటన్నది చూడాలి.
This post was last modified on August 20, 2023 7:59 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…