తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. నాయకుల చేరికలతో పార్టీల్లో సందడి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా ప్రత్యర్థి పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుని వాటిని దెబ్బకొట్టాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్లో కీలక నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలోనే కారెక్కనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు కేసీఆర్తో చర్చలు పూర్తయ్యాయని కూడా చెబుతున్నారు.
ఇదే నిజమైతే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి బీఆర్ఎస్ తరపున సంగారెడ్డి నుంచి పోటీ చేయడం ఖాయమే. కానీ ఇప్పుడిదే సంగారెడ్డి బీఆర్ఎస్ నేతలకు రుచించడం లేదు. ముఖ్యంగా అక్కడి నుంచి మరోసారి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్రెడ్డి ఈ విషయంపై అసహనంతో ఉన్నట్లు సమాచారం. అందుకే సంగారెడ్డి బీఆర్ఎస్ కీలక నేతలు, ముఖ్య అనుచరులతో కలిసి జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దంటూ హరీష్ రావును కలిసి విన్నవించారని తెలిసింది.
కానీ జగ్గారెడ్డి విషయంలో హరీష్ రావు కూడా చేయగలిగింది ఏమీ లేదని సమాచారం. తనను కలిసిన సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులకు హరీష్ కచ్చితమైన హామీ ఇవ్వలేకపోయారు. పార్టీలో జగ్గారెడ్డి చేరిక విషయంపై కలుగుతున్న వ్యతిరేకతను కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్తానని మాత్రమే హరీష్ చెప్పారు. అంతే కాకుండా టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ కోసం అందరు కలిసే పని చేయాలని కూడా హరీష్ చెప్పారని తెలిసింది. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే జగ్గారెడ్డిని ఆపడం హరీష్ వల్ల కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ అనుకున్నది కచ్చితంగా చేసి తీరతారనే పేరుంది. అందుకే ఈ విషయంలో హరీష్ రావు ఏం చేయలేకపోతున్నారని టాక్.
This post was last modified on August 19, 2023 3:30 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…