Political News

వేరే రాష్ట్రాల ఎమ్మెల్యేలు.. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల ఎంపిక

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఏ పార్టీలోనైనా అధిష్ఠానం ఖరారు చేస్తుంది. ప్రాంతీయ పార్టీలైతే రాష్ట్ర స్థాయిలోనే ఆ ప్రక్రియ ముగుస్తుంది. అదే జాతీయ పార్టీలైతే ఢిల్లీలో ఆ పని జరుగుతుంది. జాతీయ పార్టీలోనైతే స్థానిక నేతల వ్యవహార శైలి ఎలా ఉంది? ప్రజల్లో ఉంటున్నారా? లాంటి విషయాలను పరిశీలించి రాష్ట్ర నేతలు అధిష్ఠానానికి నివేదిక ఇస్తారు. దీనిపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుంది. కానీ బీజేపీ పరిస్థితి మాత్రం అందుకు విభిన్నంగా ఉంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడమే అందుకు కారణం.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పర్యటించి అభ్యర్థుల విషయంపై నివేదిక అందించాలని ఇతర రాష్ట్రాలకు చెందిన 119 ఎమ్మెల్యేలకు అధిష్ఠానం బాధ్యతలు అప్పజెప్పింది. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ఎమ్మెల్యే వారం రోజుల పాటు పర్యటించి, ఆ తర్వాత నివేదికలు సమర్పించనున్నట్లు తెలిసింది. ఈ నెల 20 నుంచే ఈ ప్రక్రియ మొదలు కానుంది. నియోజకవర్గాల్లో బీజేపీ ఎలా ఉంది? ఇక్కడ పార్టీని గెలిపించే నాయకులు ఉన్నారా? నేతల మధ్య సమన్వయం లాంటి విషయాలను ఈ ఎమ్మెల్యేలు పరిశీలిస్తారని తెలిసింది.

కానీ ఏ పార్టీలోనైనా స్థానిక నేతలకే అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంటుంది. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. అభ్యర్థుల ఎంపికపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎన్నికల నిర్వాహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్కు అధిష్ఠానం అప్పజెప్పిందనే వార్తలొచ్చాయి. మళ్లీ ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ ఏం చేస్తారనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

This post was last modified on August 19, 2023 3:27 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

36 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago