ఓ వైపు తెలంగాణలో అధికారం నిలబెట్టుకోవడం కోసం కసరత్తుల్లో నిమగ్నమైన కేసీఆర్.. మరోవైపు మహారాష్ట్రలో పార్టీ ఉనికిని చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తారు. వీలుంటే చాలు మహారాష్ట్రలో సభలు పెడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ఇస్తున్న పథకాలు, పాలన గురించి గొప్పగా చెబుతున్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి ఎవరొచ్చినా కండువా కప్పి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి సీనియర్ నటి జయప్రదను పోటీ చేయించాలని కేసీఆర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలిసింది.
జయప్రద త్వరలోనే బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది. జయప్రదను చేర్చుకోవడానికి కేసీఆర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆమెను పార్టీలో చేర్చుకుని మహారాష్ట్ర నుంచి లోక్ సభకు పోటీ చేయించాలన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ అన్ని పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో చక్రం తిప్పొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. సీట్లు ఇవ్వండి కేంద్రం మెడలు వంచుతామంటూ ఇటీవల వ్యాఖ్యానించారు కూడా. దీంతో జాతీయ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న జయప్రదను మహారాష్ట్రలో నిలబెడితే గెలిచి అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
టీడీపీతో రాజకీయాల్లో అడుగుపెట్టిన జయప్రద.. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలోకి వెళ్లారు. రెండు సార్లు ఎంపీగా గెలిచారు. కానీ తన రాజకీయ గురువుగా భావించే అమర్ సింగ్ చనిపోవడంతో జయప్రద సందిగ్ధంలో పడ్డట్లు సమాచారం. రాజకీయంగా కెరీర్ను ఎటువైపు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వైపు ఆమె మొగ్గు చూస్తున్నట్లు టాక్.
This post was last modified on August 19, 2023 3:18 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…