యువ గళం పాదయాత్రతో జోరుమీదున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడుతో సాగుతున్నారు. రాష్ట్రాన్ని చుట్టేస్తూ.. అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్న, హింసిస్తున్న అధికారులు, పోలీసుల లెక్కలను అధికారంలోకి వచ్చాక తేలుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లపై కేసులు కూడా నమోదు చేశారు. తాజాగా అలాంటి కేసు విషయంలోనే నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మీద వేసిన కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు పాదయాత్రకు విరామమిచ్చారు.
వైసీపీకి మద్దతుగా నిలిచే పోసాని టీడీపీపై, చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కంతేరులో లోకేష్ 14 ఎకరాల భూములు కొనుగోలు చేశారని పోసాని ఆరోపించారు. దీనిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంతేరులో అరసెంటు భూమి కూడా లేని తనపై ఈ తప్పుడు ఆరోపణలు చేసిన పోసాని క్షమాపణ చెప్పాలని లోకేష్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై పోసాని స్పందించకపోవడంతో తన పరువు నష్టం కలిగించారని లోకేష్ కోర్టును ఆశ్రయించారు.
అబద్ధాలు చెబుతూ, నిరాధార ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ పోసానిపై కోర్టులో లోకేష్ కేసు వేశారు. ఇప్పుడు ఈ కేసు విచారణలో భాగంగానే వాంగ్మూలాన్ని సమర్పించారు. పార్టీ జోలికి కానీ తమ జోలికి కానీ ఎవరైనా వస్తే విడిచి పెట్టేదే లేదంటూ లోకేష్ ముందుకు సాగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 19, 2023 6:16 am
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…