దసరాపండుగ సమయానికి తొలిజాబితాగా 50 మంది అభ్యర్ధుల పేర్లను మాత్రమే ప్రకటించాలని చంద్రబాబునాయుడు అనుకున్నారట. మొదట్లో మొదటి జాబితాలో 70-80 నియోజకవర్గాలను ప్రకటించాలని అనుకున్నారు. అయితే తాజా పరిస్ధితుల కారణంగా ఆ నెంబర్ ను తగ్గించేశారట. ఇపుడు అనుకుంటున్న 50 మందిలో కూడా 19 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలే ఉంటారు. వీళ్ళుకాకుండా మరో 31 మంది అభ్యర్ధులను ప్రకటించేందుకు జాబితా రెడీ అవుతోందట. ఎలాంటి వివాదాలు లేని, సీనియర్లకు పోటీలు లేని నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని అక్కడ 31 మందిని ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించారట.
పార్టీ తరపున థర్డ్ పార్టీగా రెండు సంస్ధలతో ఎప్పటికప్పుడు చంద్రబాబు సర్వేలు చేయించుకుంటున్నారు. అలాగే రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ ఎలాగూ తన బృందంతో రెగ్యులర్ గా సర్వేలు చేస్తునే ఉన్నారు. అన్నింటినీ సమప్ చేసి సర్వే రిపోర్టులను విశ్లేషిస్తున్నారు. తాను చేస్తున్న పర్యటనల ఫీడ్ బ్యాక్, లోకేష్ యువగళం పీడ్ బ్యాక్ రెండింటిపైనా పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు రిపోర్టులను తెప్పించుకుంటున్నారు.
వీటికి అదనంగా నియోజకవర్గాల ఇన్చార్జిలతో తరచూ సమావేశమవుతున్నారు. అంటే రకరకా మార్గాల్లో గ్రౌండ్ రిపోర్టు తెప్పించుకోవటంలో చంద్రబాబు చాలా బిజీగా ఉంటున్నారు. ఇన్ని మార్గాల్లో రిపోర్టులు తెప్పించుకున్న తర్వాతే మొదటిజాబితాగా 50 మంది అభ్యర్ధులను ప్రకటించాలని అనుకున్నారట. మరి మిగితా అభ్యర్దులను ఎప్పుడు ప్రకటిస్తారు ? ఎప్పుడంటే పొత్తుల విషయం ఫైనల్ అయిన తర్వాతే అని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
జనసేనతో పొత్తుంటుందని ఒకసారి ఉండదని మరోసారి అనిపిస్తోంది. జనసేనతో పాటు బీజేపీ పరిస్ధితి ఏమిటో అర్ధంకావటంలేదు. పొత్తుపెట్టుకుంటే లాభమా ? లేకపోతే ఒంటరిగా పోటీచేస్తేనే లాభమా అన్న విషయంలో బాగా అయోమయం కనబడుతోంది. కొందరు తమ్ముళ్ళేమో అసలు రెండుపార్టీలతోను పొత్తు వద్దని పదేపదే చెబుతున్నారు. దాంతో పొత్తుల అంశం బాగా అయోమయం పెంచేస్తోంది. అందుకనే మొదటిజాబితాలో కేవలం 50 మంది అభ్యర్ధులను మాత్రమే ప్రకటించాలని అనుకున్నారట. మొదటిజాబితాను ప్రకటించేస్తే ప్రత్యర్ధిపార్టీలపై ఆటోమేటిగ్గా ఒత్తిడి మొదలైపోతుంది. అప్పుడు పొత్తుల విషయం ఫైనల్ అవుతుందని అనుకుంటున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 17, 2023 1:42 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…