వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరుదైన రికార్డు సాధించారు. 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తొలి మహిళగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. ఇంతవరకు సంతోషించాల్సిన విషయమే. గతంలో కూడా షర్మిల పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా ఏపీలో షర్మిల పాదయాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇపుడు తెలంగాణాలో పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి పాదయాత్ర చేస్తున్నారు.
వివిధ కారణాలతో పాదయాత్రకు బ్రేకులు పడినా మళ్ళీ మొదలుపెట్టారు. పాదయాత్ర చేయడం ద్వారా షర్మిల ఫిజికల్, మెంటల్ స్టామినా అందరికీ అర్థమైంది. అయితే దీనివల్ల ఎవరికైనా ఏమైనా ఉపయోగముందా ? అన్నదే ప్రశ్న. ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా జనాల్లో పెద్దగా రిజిస్టర్ కాలేదు. పార్టీ పెట్టి సుమారు రెండేళ్ళవుతున్నా జనాలు కానీ లేదా ఇతర రాజకీయ పార్టీలు కానీ వైఎస్సార్టీపీని ఒక రాజకీయపార్టీగా గుర్తించటంలేదు.
పార్టీపెట్టి రెండేళ్ళవుతున్నా ఇంకా ఉనికి చాటుకోవటం కోసమే షర్మిల నానా అవస్థలు పడుతున్నారు. ఎంతకాలం గడచినా ఎలాంటి ఉపయోగం ఉండదనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేసేయాలని హస్తంపార్టీ నేతలు ప్రతిపాదించారు. దీనికి షర్మిల కూడా సానుకూలంగానే స్పందించారనే ప్రచారం అందరికీ తెలిసిందే. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే తనకు దక్కబోయే హోదా, పోటీచేయబోయే స్ధానం లాంటి చర్చలు ఒక కొలిక్కి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జరుగుతున్న ప్రచారం నిజమే అయితే తొందరలోనే కాంగ్రెస్ లో షర్మిల తన పార్టీని విలీనం చేయడం ఖాయం. ఖమ్మం జిల్లా పాలేరు నుండి అసెంబ్లీకో లేకపోతే సికింద్రాబాద్ ఎంపీగానో పోటీ చేస్తారు. ఎన్నివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా, మరెన్ని పాదయాత్రలు చేసినా షర్మిలకు దక్కబోయే ప్రజామద్దతుపైన అనుమానంగానే ఉంది. ప్రజామద్దతు లేనపుడు ఎన్ని విన్యాసాలు చేసినా ఉపయోగముండదు. ఇండియన్ బుక్ ఆఫ రికార్డులు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులు ఇదికూడా సరిపోదంటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి పేరు చేరుతుందంతే.
This post was last modified on August 16, 2023 1:10 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…