ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా తాడికొండ నుంచి గెలిచిన ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరడం ఖాయమైంది. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర తాడికొండ చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి రైతులతో లోకేష్ ముఖాముఖీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి శ్రీదేవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన ఆమె.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మేలు చేసేలా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలతో శ్రీదేవిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఇక ఆమెను టీడీపీలో చేర్చుకునేందుకు సిద్ధమైన చంద్రబాబు ఓ కండీషన్ పెట్టారని తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నుంచి టీడీపీ తరపున శ్రీదేవి పోటీ చేయాలని చూస్తున్నారు. అది కాకపోతే ప్రత్తిపాడు స్థానంలోనైనా ఛాన్స్ ఇవ్వాలని బాబును కోరుతున్నట్లు తెలిసింది.
కానీ తాడికొండలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌కు టీడీపీ తరపున టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక ప్రత్తికొండలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులకు బాబు అవకాశం ఇస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీదేవిని బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం బరిలో దింపే ఆలోచనలో బాబు ఉన్నట్లు టాక్. అక్కడి నుంచి వైసీపీ ఎంపీగా ఉన్న నందిగాం సురేష్‌కు శ్రీదేవితో చెక్ పెట్టాలన్నది బాబు ప్లాన్‌గా కనిపిస్తోంది. మరి అందుకు శ్రీదేవి ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
This post was last modified on August 16, 2023 11:05 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…