Political News

జ‌గ‌న్ నోట‌.. మూడు రాజ‌ధానుల మాట‌.. ఏమ‌న్నారంటే!

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. కొన్నాళ్ల కింద‌ట వ‌ర‌కు ఎక్క‌డ ప‌ర్య‌టించినా.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌స్తావిం చేవారు. అయితే.. ఈ మూడు రాజ‌ధానుల‌పై కోర్టుల్లో కేసులు ప‌డ‌డం.. వాటిపై కొన్ని వ్య‌తిరేక తీర్పులు రావ‌డం.. దీంతో సుప్రీం కోర్టులో స‌ర్కారు స‌వాలు చేయ‌డం తెలిసిందే. దీంతో ఏం మాట్లాడితే ఏమ‌వుతుం దోన‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ ఆ త‌ర్వాత నుంచి మౌనంగా ఉంటున్నారు.

అయితే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో  విజ‌య‌వాడ‌లో జ‌రిగిన 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మాత్రం మ‌రోసారి మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. తొలుత సాయుధ దళాలు సీఎం జ‌గ‌న్‌కు గౌరవ వందనం సమర్పించాయి. ప్రత్యేక వాహనంపై సీఎం పెరేడ్ ను పరిశీలించా రు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నాలుగేళ్లలో సాధించిన అభివృద్ధిని పేర్కొంటూ 13 అభివృద్ధి శకటాలను ప్ర‌ద‌ర్శించారు.  

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. మూడు రాజధానులను మూడు ప్రాంతాల హక్కుగా అమలు చేయబోతున్నామన్నారు. “ఆనాడు భార‌తంలో సైంధ‌వుడు ఉండేవాడ‌ట‌. అయినా జ‌ర‌గాల్సిన న్యాయం జ‌రిగింది. ఇప్పుడు కూడా ఎంతో మంది సైంధ‌వులు ఉన్నారు. మూడు ప్రాంతాల‌కు మంచి జ‌ర‌గ‌కూడ‌ద‌నివారు కోరుకుంటున్నారు. అయినా.. న్యాయ‌మే గెలుస్తుంది. మూడు రాజ‌ధానుల‌ను మూడు ప్రాంతాల హ‌క్కుగా అమ‌లు చేయ‌బోతున్నాం“ అని జ‌గ‌న్ అన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ ను 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్య‌మంత్రి తెలిపారు. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో 50 నెలల్లో చేసి చూపించామ‌న్నారు.  ఏ ప్రభుత్వమూ చేయని గొప్ప మార్పులు చేశామన్నారు.  వ్యవసాయం, విద్య, వైద్యం , మహిళ సాధికారత, సామాజిక న్యాయం, పారిశ్రామిక రంగంలో అనేక కీల‌క మార్పులు తీసుకువ‌చ్చామ‌ని.. రాష్ట్రం అన్ని విధాలా పురోగ‌మిస్తోంద‌ని సీఎం జ‌గ‌న్ వివ‌రించారు.

This post was last modified on August 15, 2023 1:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ కు మరోసారి లీగల్ నోటీసులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…

1 hour ago

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

1 hour ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

2 hours ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

4 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

4 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

4 hours ago