ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. పరిణామాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. అధికారం నిలబెట్టుకోవడం కోసం బీఆర్ఎస్.. అధికారం దక్కించుకోవడం కోసం బీజేపీ, కాంగ్రెస్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడో సారి సీఎం పీఠంపై కూర్చునేందుకు కేసీఆర్ ప్రణాళికల్లో నిమగ్నమయ్యారని తెలిసింది.
ఈ ఎన్నికల్లో విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్‌కు.. కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయని టాక్. అందులో ముఖ్యంగా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిసింది. ఇప్పటికే వివిధ సర్వేల ద్వారా ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో వీళ్లకున్న అభిప్రాయాలను కేసీఆర్ తెలుసుకున్నారు. ఈ విషయంపై కొంతమంది ఎమ్మెల్యేలనూ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. కానీ ఎలాంటి మార్పు లేకపోవడంతో ఎన్నికలకు ముందు తీవ్రమైన హెచ్చరిక జారీ చేస్తున్నట్లు తెలిసింది.
ఎన్నికలకు ముందున్న ఈ సమయం ఎంతో కీలకమైందని, ఎమ్మెల్యేలందరూ జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ చెబుతున్నారని సమాచారం. గ్రాఫ్ సరిగ్గా లేని ఎమ్మెల్యేలను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మరీ కేసీఆర్ వార్నింగ్ ఇస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు అమలయ్యాయా? ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యేలు ఉంటున్నారా? తదితర విషయాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారని అంటున్నారు. సర్వే ఫలితాలను ముందేసుకుని ఒక్కో ఎమ్మెల్యేకు క్లాస్ పీకుతున్నట్లు తెలిసింది. మార్పు రాకపోతే టికెట్ ఇచ్చేది లేదని కేసీఆర్ తెగేసి చెబుతున్నారని టాక్.
This post was last modified on August 14, 2023 6:27 pm
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…